శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’. యదునాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సుమంత్ నాయుడు నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘మొదలే మొదలే..’ అనే పాటను విడుదల చేశారు. ‘విన్నాలే వింటున్నానే మనసున నీ మాట. అన్నాలే అంటున్నాలే బదులుగా నా మాట.. అలా అలా వెళ్లిపోతూ మళ్లీ మళ్లీ నిన్ను చూశా.. మిలా మిలా రెప్పచాటు మౌనరాగాలన్నీ చదివేశా’ అంటూ చక్కటి ప్రేమ భావాలను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది.
రథన్ స్వరపరచిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రచించారు. ఈ పాటలో నాయకానాయికలు శ్రీవిష్ణు, నయనసారిక కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రథన్, నిర్మాణ సంస్థ: శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్, రచన-దర్శకత్వం: యదునాథ్ మారుతీరావు.