ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారుదే జోరు.. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ కారు కైవసం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు కనిపించింది. మొత్తం 10 మున్సిపాలిటీల్లో ఐదింటిలో కారు దూసుకుపోయింది. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
- ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లోనూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం
- బెల్లంపల్లిలో అధికార కాంగ్రెస్ పార్టీకి సమానంగా జోరు చూపించిన కారు
- ఖానాపూర్‌లో మూడింటి మధ్య హంగ్
- ఆదిలాబాద్‌లో బీజేపీ, భైంసాలో ఎంఐఎం ఆధిక్యం.. లక్షెట్టిపేట, చెన్నూర్, మంచిర్యాల కాంగ్రెస్ కైవసం
- కీలకంగా మారిన ఇండిపెండెంట్లు
మంచిర్యాల, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు కనిపించింది. మొత్తం 10 మున్సిపాలిటీల్లో ఐదింటిలో కారు దూసుకుపోయింది. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 22 స్థానాల్లో బీఆర్ఎస్ 10, బీఆర్ఎస్ మిత్రపక్షం సీపీఐ 4 స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్ 7, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. దీంతో క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో గులాబీజెండా ఎగిరింది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 స్థానాలకు బీఆర్ఎస్ 9 స్థానాల్లో గెలిచింది.
కాంగ్రెస్ 7 స్థానాలతో సరిపెట్టుకోగా.. స్వతంత్య్ర అభ్యర్థులు 4 చోట్ల గెలుపొందారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. కాగజ్‌నగర్‌లో మొత్తం 30 స్థానాలకు బీఆర్ఎస్ 11 స్థానాల్లో గెలిస్తే, కాంగ్రెస్ 9, బీజేపీ 5 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు నలుగురు, ఎంఐఎం నుంచి ఒకరు గెలిచారు. ఏ పార్టీ మ్యాజిజ్ ఫిగర్ అందుకోలేకపోవడంతో స్వతంత్రులు కీలకంగా మారారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో మొత్తం 34 స్థానాలు ఉండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ 14 చొప్పున స్థానాల్లో గెలిచాయి.
బీజేపీ ఒకటి, ఇతరులు ఐదు స్థానాల్లో గెలిచారు. ఇక్కడ కూడా స్వతంత్రులు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ మున్సిపల్ కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లోనూ బీఆర్ఎస్ సత్తా చాటింది. మొత్తం 12 స్థానాల్లో కాం గ్రెస్ 3, బీఆర్ఎస్ 4, బీజేపీ 4 , ఒక స్థానంలో ఇతరులు గెలిచారు. దీంతో మున్సిపల్ చైర్మన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట, చెన్నూర్, నిర్మల్ మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఆదిలాబాద్‌లో బీజేపీ, భైంసాలో ఎంఐఎం, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

