జడ్చర్ల, ఆగస్టు 5 : పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేట్‌కు దీటుగా మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేశారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను శుక్రవారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలోని తరగతిగదులను తిరిగి విద్యార్థినులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాలలో అందిస్తున్న భోజనం, ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీశారు.
అలాగే డైనింగ్హాల్ను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థినులకు పీఈటీ అధికంగా గుంజీలు తీయించడం సరికాదన్నారు. విద్యార్థినుల అస్వస్థతకు కారణమైన పీఈటీని విధు ల నుంచి తొలగించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా ప్రిన్సిపాల్, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు.
గురుకులాన్ని అప్‌గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్‌చందర్, పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్‌గౌడ్, మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ సారిక, కౌన్సిలర్లు జ్యోతీకృష్ణారెడ్డి, శశికిరణ్, ముడా డైరెక్టర్లు ఇంతియాజ్‌ఖాన్, శ్రీకాంత్, ఇర్షాన్, రామ్మోహన్, జంగ య్య, మహేశ్‌గౌడ్, బీకేఆర్, ప్రిన్సిపాల్ కల్పన పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలోని పెద్దపల్లిలో శుక్రవారం నిర్వహించిన శివాలయ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వార్షికోత్సవం సందర్భంగా శివాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలతో కుంకుమార్చ న, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట, ఆగస్టు 5 : ముఖ్యమంత్రి సహాయనిధి అభాగ్యులకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నా రు. మండలకేంద్రానికి చెందిన రాజలింగం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతడి వైద్యఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.5లక్షల ఎల్వోసీని శుక్రవా రం హైదరాబాద్‌లో బాధిత కుటుంబసభ్యులకు అందజేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదల ప్రా ణాలను కాపాడుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ పీ అనంతయ్య, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, మార్కె ట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, సర్పంచ్ గోపాల్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నర్సింహులు, రవి పాల్గొన్నారు.