జడ్చర్ల, ఆగస్టు 5: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని పథకాలను తెలంగాణలో అమలు చేసినట్లు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దపల్లి, చిన్నపల్లిలో శుక్రవారం ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా చిన్నపల్లిలో గ్రామ పంచాయతీ భవన, సీసీరోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అదేవిధంగా మినరల్ వాటర్‌ప్లాంట్, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. అనంతరం పెద్దపల్లిలో అంగన్వాడీ భవనాన్ని, వీర్కో ఫౌండేషన్ ఆర్థికసాయంతో నిర్మించిన మండల పరిషత్ పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.
వైకుంఠధామాన్ని సర్పంచ్ చెన్నమ్మతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా పెద్దపల్లి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పెద్దపల్లి, చిన్నపల్లిలో వీర్కోఫౌండేషన్ వారు పాఠశాలలు, రోడ్లు నిర్మించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని, బంగారు తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. 2018ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలోని ఇండ్లు లేని పేదలందరికీ ఇండ్లు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారని గుర్తుచేశారు.
కానీ, నేటివరకు ఎక్కడ కూడా ఒక్క ఇల్లు నిర్మించలేదని బీజేపీ నాయకులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. రూ.50కే లీటర్ పెట్రోల్ అమ్మేవారని బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.110కి తీసుకొచ్చారన్నారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.400ఉంటే రూ.1100కు పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దేశంలోని 20బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, పెన్షన్లు తదితర పథకాలు లేవని, తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటుందని, కానీ వారు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రులను మార్చడానికే సరిపోతుందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా మండలంలోని వల్లూరుకు చెందిన తాటికొండ మాసయ్యకు దళితబంధు కింద మంజూరైన కారును ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అందజేశారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు.
కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణిల్చందర్, బాదేపల్లి పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, సర్పంచులు సంగీత, చెన్నమ్మ, ప్రభాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, నర్సింహులు, సత్యనారాయణ, ముడా డైరెక్టర్లు ఇంతియాజ్, శ్రీకాంత్, ఉప సర్పంచులు తిరుపతిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు రంగయ్య, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో ఉమాదేవి, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఏఈ జవహర్‌బాబు, వీర్కో ఫౌండేషన్ ప్రతినిధులు ద్వారక్నాథ్రెడ్డి, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.