అయిజ, ఆగస్టు 1 : కర్ణాటకలోని టీబీ డ్యాంకు వర ద స్థిరంగా కొనసాగుతున్నది. సోమవారం డ్యాంలోకి 52,875 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 10 గేట్లు ఎత్తి 39,547 క్యూసెక్కులు దిగువకు వదిలారు. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వకుగానూ 103.740 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు 36,443 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో, 36 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. ఆయకట్టుకు 443 క్యూసెక్కులు వదిలారు. ప్రస్తుతం ఆనకట్టలో 10.5 అడుగుల నీటి మట్టం ఉన్నది.
రాజోళి, ఆగస్టు 1 : సుంకేసుల జలాశయానికి 35, 948 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 8 గేట్లు ఎత్తి 33,936 క్యూసెక్కులు దిగువకు వదిలారు. 2,012 క్యూసె క్కులను కేసీ కెనాల్‌కు విడుదల చేశారు.
అమరచింత, ఆగస్టు 1 : జూరా ల రిజర్వాయర్‌కు వరద తగ్గింది. సోమవారం సాయంత్రం 49,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. విద్యుదుత్పత్తి కోసం 43,732 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. భీమా లిఫ్ట్-2కు 750, కుడి కాల్వ కు 508, ఎడుమ కాల్వకు 1,060 క్యూసెక్కులు వదిలారు. దీంతో ప్రాజెక్టు నుంచి 48,177 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
శ్రీశైలం, ఆగస్టు 1 : శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. సోమవారం జూరాల విద్యుదుత్పత్తి నుంచి 43,732, సుంకేసుల నుంచి 33,936 క్యూసెక్కులు విడుదల కాగా.., శ్రీశైలం జలాశయానికి 1,04,961 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఏపీ పవర్‌హౌస్‌కు 9,591, టీఎస్ పవర్‌హౌస్‌కు 31,784 క్యూసెక్కులు వదిలారు. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 196.11 టీఎంసీలు నిల్వ ఉన్నది.