మక్తల్ రూరల్, ఆగస్టు 1 : మండలంలోని చిట్యాల గ్రా మానికి “మన ఊరు, మన బడి” కార్యక్రమంలో వివిధ పనులు నిర్వహించడానికి తిరిగి ‘రీ’ టెండర్లు వేయాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్‌తోపాటు డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా చి ట్యాల గ్రామాన్ని సోమవారం సందర్శించారు. అనంతరం సర్పంచ్ జానకి అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభ సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
పాఠశాలలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ గ్రామానికి మన ఊరు మన బడి పథకం కింద పాఠశాల అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.35 లక్షలు మంజూరు చేసిందన్నారు. పనుల కోసం టెండర్లు వేయగా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చామన్నారు. పాఠశాలలో 250 మంది విద్యార్థులు చదువుతున్నారని, 8 తరగతుల కు కేవలం నాలుగు గదులు మాత్రమే ఉన్నాయన్నారు.
ప్ర స్తుతం రెండు గదులు మంజూరయ్యాయని, అదనంగా మ రో రెండు గదులు కావాలని కోరారు. అలాగే పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, 8 తరగతులకు 5గురు మా త్రమే ఉన్నారని, ఇద్దరు డిప్యూటేషన్‌పై వెళ్లారని, పూర్తి స్థా యిలో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని కోరారు. దీనిపై అదనపు కలెక్టర్ స్పందిస్తూ మన ఊరు మన బడి కార్యక్రమం కింద మంజూరైన పనులకు వెంటనే రీ టెండర్లను పిలువాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యలను తీర్చడానికి ప్రత్యామ్నాయంగా డిప్యూటేషన్‌పై నియమించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
హరితహారంలో భాగంగా గ్రామంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఇన్చార్జి డీఈవో, ఎంపీపీ వనజ మొక్కలు నాటి నీళ్లు పో శారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్, ఏపీవో పావని, ఏపీవో గౌరీశంకర్, ఎంపీటీసీ రాంలింగం, నాయకులు తదితరు లు పాల్గొన్నారు.
మండలంలో అతిపెద్ద గ్రామ పంచాయతీ కర్ని గ్రామా న్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. కర్ని నుంచి చిట్యాల గ్రామానికి వెళ్తున్న అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా కలిసి సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. ప్ర భుత్వం ఇటీవల రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేసి న నేపథ్యంలో కర్ని గ్రామాన్ని కూడా మండలకేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. స్పందించిన వారు విషయంపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆక్రమ్, ఎంపీటీసీ రం గప్ప, మాజీ ఎంపీటీసీ రాధాదత్తురాం, రైతుబంధు సమితి గ్రామ కమిటీ చైర్మన్ వసంతగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.