నారాయణపేట, ఆగస్టు 1 : ఎస్సై పోస్టుల నియామకం కోసం ఈనెల 7న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షను ప కడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ వెంకటేశ్వర్లు అధికారుల ను ఆదేశించారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో పరీ క్ష నిర్వహణపై పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లతో సోమవారం అ వగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పరీక్ష నిర్వహణ కోసం పట్టణంలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, జిల్లాలో మొత్తం 1, 218 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతార ని పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని, పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులతో బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకుంటారని, చేతులకు గో రింటాకు పెట్టుకొని రాకూడదన్నారు.
పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులను అనుమతించరని, ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారని ఆయన తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేం ద్రంలోకి అనుమతించరని, అభ్యర్థులు గంట ముందే కేం ద్రం వద్దకు చేరుకోవాలన్నారు. ఎంపిక విధానం పారదర్శకంగా కొనసాగుతుందని, ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే రీజినల్ కో ఆర్డినేటర్ దేవసేన, డీసీఆర్బీ డీ ఎస్పీ వెంకటేశ్వరావు దృష్టికి తీసుకొచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీ సత్యనారాయణ, సీఐ శ్రీ కాంత్‌రెడ్డి, ఎస్సై రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
బెంగళూరు వేదికగా డైనమిక్ షోటోకాన్ కరాటే డూ అ సోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవలే ఏషియన్ ఆన్లైన్ కరా టే చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో అం డర్ 19 కటాక్ విభాగంలో పట్టణానికి చెందిన మాస్టర్ కేశ వ్ కరాటే మార్షల్ అకాడమీ విద్యార్థి మహేశ్ బంగారు పత కం సాధించాడు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వెంకటేశ్వర్లు విద్యార్థి మహేశ్‌ను అభినందించారు.