నారాయణపేట టౌన్, ఆగస్టు 1 : ప్రభుత్వ ఆదేశాల మే రకు జిల్లాలోని వీఆర్వోలను వివిధ శాఖలకు కేటాయించినట్లు కలెక్టర్ హరిచందన అన్నారు. పట్టణంలోని కలెక్టర్ సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్, ఆర్డీవో, వివిధ శాఖల అధికారుల సమక్షంలో సోమవారం వీడియో కవరే జ్ చేయిస్తూ లక్కీడిప్ నుంచి వీఆర్వోలకు శాఖల కేటాయిం పు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం నుంచి సిఫారసు చేయగా, జిల్లాలోని మొత్తం 124 మంది వీఆర్వోలకు లక్కీడిప్ నుంచి శాఖలను కేటాయించినట్లు తెలిపారు. కేటాయింపు నిర్వహించిన వీఆర్వోలకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, అ దనపు కలెక్టర్ పద్మజారాణి, ఆర్డీవో రాంచందర్రావు, ఏవో నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
సృజనాత్మకతను వెలికితీసేలా ఆవిష్కరణలు చేయాలని కలెక్టర్ హరిచందన సూచించారు. పట్టణంలోని కలెక్టర్ కా ర్యాలయంలో సోమవారం ఇంటింటా ఇన్నోవేటర్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ వారు జిల్లాలోని అన్ని రంగాల ప్రజల వాట్సాప్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
ఆవిష్కర్తలు పేరు, వయస్సు, ఆవిష్కర్త వివరణ వ్యాఖ్యలు, ఆవిష్కరణ 4 చిత్రాలు, ఆవిష్కరణకు సంబంధించిన 2 నిమిషాల వీడియోను 9100678543 నెం బర్కు ఆగస్టు 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన ఆవిష్కరణలను ఆగస్టు 15న ప్రదర్శించే అవకాశం ఉంటుందన్నారు. ఆవిష్కర్తల కు సర్టిఫికెట్ ప్రదానంతోపాటు టీఎస్ఐసీ టీం నుంచి ఉ త్తమ ఆవిష్కరణలకు సాంకేతిక సహకారం ఉంటుందన్నా రు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, ఏఎమ్వో విద్యాసాగర్, ఎస్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వర్షాలు కురుస్తున్న కారణంగా రైతులు, ప్రజలు పిడుగుపాటుకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హరిచందన సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2021 బుక్, పిడుగుపాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాల్పోస్టర్ను ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా హ్యాండ్ బుక్ ఆ ఫ్ స్టాటిస్టిక్స్ పుస్తకంలో జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, చేనేత చీరల వివరాలు, వర్షపాతం వివరాలు, జనాభా వివరాలు, వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమల వివరాలు పొందుపరచబడ్డాయన్నారు. వర్షం కురుస్తున్న సమయం లో ప్రజలెవరూ చెట్ల కింద ఉండరాదన్నారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ పద్మజారాణి, సీపీవో గోవిందరాజన్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.