ఊట్కూర్, ఆగస్టు 1 : యుద్ధ ప్రాతిపదికన గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలంటూ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజల బా గోగులను తెలుసుకునేందుకు సోమవారం వరద నీటిని సై తం లెక్క చేయకుండా ఎమ్మెల్యే వాగులు దాటుకుంటూ సుడిగాలి పర్యటన చేపట్టారు. మండలంలోని ఓబ్లాపూర్, సామనూర్, అమీన్పూర్, పగిడిమర్రి తదితర గ్రామాల్లో పర్యటించి మురుగు నీటి గుంటలు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు.
ప్రధానంగా ఓబ్లాపూర్, అమీన్పూర్ గ్రామాల్లో మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తుండడం చూసి ఎమ్మెల్యే చ లించిపోయారు. ఇలాగైతే ప్రజలు రోగాల బారిన పడరా.. అంటూ గ్రామ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కా లనీల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. సా యంత్రంలోగా పారిశుధ్యాన్ని మెరుగుపర్చకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. నెల రోజుల్లో తిరిగి అమీన్పూర్ గ్రామానికి వస్తానని, అంతలోగా సైడు కాల్వల నిర్మాణం పూర్తి చేయించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని అధికారులను ఆదేశించారు.
కురుస్తున్న భారీ వర్షాలతో అమీన్పూర్ చీకటి వాగు, సామనూర్, అమీన్పూర్ గ్రామాల మధ్య వాగు, పగిడిమర్రి సమీపంలోని పెద్ద వాగు లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచి ప్రజలు బయటకు వెళ్లలేక గ్రామాలకే పరిమితమయ్యారు. ఈక్రమంలో అమీన్పూర్, సామనూర్ గ్రా మాల్లో ప్రజలను పరామర్శించి సమస్యల ను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే ఓబ్లాపూర్ నుంచి బయలుదేరారు. రెండు గ్రామాల మ ధ్యన ఉన్న చీకటి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ లెక్క చేయకుండా వాహనం న డుపుతూ వెళ్లి ప్రజలను పలకరించారు.
కాగా, వాగుల వద్ద వంతెనల నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారీ వాగులు దాటేందుకు ఇలాగే ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఎమ్మె ల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఆయన వంతెనల పునర్ నిర్మాణం చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, మాజీ విండో అధ్యక్షుడు నారాయణరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, నాయకులు శేఖర్‌రెడ్డి, ఈశ్వర్‌యాదవ్, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, ఆగస్టు 1 : ఈదమ్మ ఆలయం పనులు త్వ రగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి నేషనల్ హైవే అధికారులను ఆ దేశించారు. పట్టణంలోని మినీట్యాంక్ బండ్ (పెద్ద చెరువు) ఆనుకొని నేషనల్ హైవే పక్క ఉన్న ఈదమ్మ ఆలయం నేషనల్ హైవే వెడల్పులో భా గంగా పోవడంతో కొత్తగా చెరువు కట్టకు ఆనుకొని నూతన ఈదమ్మ ఆలయ ని ర్మాణ పనులు కొనసాగుతుండడంతో సోమవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఆలయ ని ర్మాణం దృఢంగా మన్నికతో కట్టాలని అధికారులకు సూచించారు త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలన్నారు. అదేవిధంగా నల్లజానమ్మ ఆలయం ఎదుట బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రవిశంకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి పోటీలకు మక్తల్ నియోజకవర్గ విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణమని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో జిల్లా షూటింగ్ బాల్ ఆధ్వర్యంలో రాష్ర్టస్థాయి సబ్ జూనియర్లో జిల్లా నుంచి 22 మంది బాలబాలికలు పాల్గొని క్రీడానైపుణ్యాన్ని ప్రదర్శించి జాతీయస్థాయి ఎంపికైన ఎ నిమిది మంది బాలబాలికలను సోమవారం ఎమ్మెల్యే చి ట్టెం సన్మానించి అభినందించారు. బాలబాలికలు జాతీయ స్థాయిలో ఆడి బంగారు పతకాలు సాధించాలని క్రీడాకారులకు సూచించారు.
జాతీయస్థాయికి ఎంపికైన బాలబాలికలు లక్ష్మి, వైష్ణవి, శివకుమార్, నితిన్, గణేశ్, అడ్నన్, కోచ్‌లు అమ్రేశ్, దామోదర్, రమేశ్, తిరుపతమ్మ క్రీడాకారులు ఎంపికయ్యారు. కా ర్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ రె డ్డి, ప్రధానకార్యదర్శి గోపాలం, రవిశంకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి త దితరులు పాల్గొన్నారు.