కల్వకుర్తి, ఆగస్టు 1: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే తెలంగాణ నెంబర్వన్ స్థానంలో నిలిచిందని శాసనమండలి సభ్యులు కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. చరికొండ గ్రామ పంచాయతీకి చెందిన 20 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కశిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈసందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గంలో సాగునీటికి ప్రభుత్వం పెద్దపీట వేసిన క్రమంలో ఎంజీకే ఎల్ఐ ద్వారా నియోజకవర్గంలో దాదాపు 70వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పాలమూ రు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందనుందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు కాలం చెల్లింద ని, కేవలం ఉనికి కోసం పడరాని పాట్లు పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుధాకర్, క రుణాకర్, మహేందర్,చెన్నయ్య, సురేశ్, గోపాల్, మ ల్లేశ్, కుమార్, మహేశ్, రాజు,దుర్గయ్య, వెంకటేశ్, శివ, శంకర్, శ్రీరాములు, హరికృష్ణ, భీష్మాచారి,లక్ష్మయ్య, వెంకటయ్య మోతీలాల్ పాల్గొన్నారు.