వనపర్తి రూరల్, జూలై 28 : జిల్లాలో డెంగీ నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ ఆవరణ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆ ధ్వర్యంలో నిర్వహించిన డెంగీ నివారణ ర్యాలీని గురువా రం మున్సిపాల్ చైర్మన్ గట్టుయాదవ్, డీఎంహెచ్‌వో రవిశంకర్‌తో కలిసి అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ డెంగీ వ్యాప్తి చెందకుండా ప్రజలు బాధ్యత వహించాలన్నారు.
ప్రతిఒక్కరూ త మ ఇంటి చుట్టూపక్కల ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుం డా చూసుకోవాలని, నిల్వ ఉన్న నీటిలో దోమలు తొందరగా వృద్ధి చెందకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. వీలైతే ఇం టి కిటికీలకు, బయటి తలుపుల ద్వారాలకు దోమలు లోపలికి రాకుండా జాలీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
వేపాకుతో పొగపెట్టడం లాంటివి చేసుకోవాలన్నారు. డెంగీ, చి కున్గున్యా వ్యాధి రాకుండా దోమలను నిర్మూలించుటలో అందరూ సహకరించాలన్నారు. ప్రతి శుక్రవారం డై డ్రైడేను పాటించడం వల్ల దోమలు కుట్టకుండా నివారించవచ్చునన్నారు. మండలంలోని పలు గ్రామాలైన పెద్దగూడెం, చిమనగుంటపల్లి, కడుకుంట్ల తదితర గ్రామాల్లో డెంగీ నివారణ ర్యాలీని ఆయా గ్రామ సర్పంచులు కొండన్న, రాజేశ్వరి, ఎం పీటీసీ కురుమూర్తి ప్రారంభించారు.
కార్యక్రమంలో డిప్యూ టీ డీఎంహెచ్‌వో శ్రీనివాసులు, డాక్టర్ రాంచందర్‌రావు, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాయినాథ్‌రెడ్డి, మాస్ మీడియా అధికారి చంద్రయ్య, సబ్యూనిట్ అధికారి శ్రీనివాస్‌జీ, హెల్త్ ఎడ్యుకేటర్ మధు, సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు రాజు, రాము, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పెబ్బేరు, జూలై 28 : వానకాలంలో ప్రబలే డెంగీ వ్యాధి నివారణ చర్యలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని వై ద్యురాలు సాయిశ్రీ తెలిపారు. డెంగీ వ్యాధి నివారణ మాసోత్సవాల సందర్భంగా గురువారం వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన ర్యాలీలో మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు కరుణశ్రీ, శ్యామల, జెడ్పీటీసీ పద్మ హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
మదనాపురం, జూలై 28 : డెంగీ నిర్మూలనపై గువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారి ఉమా, ఆరోగ్య విస్తరణ అధికారి రవీందర్‌గౌడ్, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
అమరచింత, జూలై 28 : పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకొని ఆరోగ్య సూత్రాలను పాటించి, అంటువ్యాధులను తరిమికొడదామని ప్రభుత్వ వైద్యుడు ప్రవీణ్‌కుమార్, హెల్త్ సూపర్వైజర్ సత్యమ్మ అన్నారు. డెంగీ నివారణ మాసోత్సవం సందర్భంగా ఆరోగ్యోశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పట్టణ పురవీధుల గుండా ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాలరామ్, స్వామి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గోపాల్పేట, జూలై 28 : వానకాలం కావడంతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వైద్యాధికారి మంజుల అన్నారు. డెంగీ నివారణపై మండలకేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారు లు, విద్యార్థులు, వైద్య సిబ్బంది గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎంపీపీ అడ్డాకుల సంధ్య, జెడ్పీటీసీ మంద భార్గవి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో తాసిల్దార్ సునీత, ఎంపీడీవో కరుణశ్రీ, ఎంపీవో హుస్సేనప్ప, ఏపీవో నరేందర్, సర్పంచ్ శ్రీనివాసులు, కోఆఫ్షన్ సభ్యుడు మతీన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొత్తకోట, జూలై 28 : పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెంగీ నివారణపై గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి షర్మీల మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇండ్లలోకి దోమలు చేరకుండా సాయంత్రం కాగానే తలుపులు, కిటికీలు మూసివేయాలని సూచించారు. దోమలు వ్యాప్తి చెం దకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి మంజుశ్రీ, ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు త దితరులు పాల్గొన్నారు.
వీపనగండ్ల, జూలై 28 : వర్షాకాలంలో విష జ్వరాల బారిన పడకుండా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. గురువారం మండలకేంద్రంలో డెంగీపై ర్యాలీ కార్యక్రమం నిర్వహించి విష జ్వ రాల నివారణపై అవగాహన కల్పించారు. అదేవిధంగా బొ ల్లారంలో అధికారులు విద్యార్థులతో డెంగీపై ర్యాలీ కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య బృందం, ఉపాధ్యాయులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పాన్‌గల్, జూలై 28 : డెంగి నివారణ మాసోత్వవం సందర్భంగా మండలకేంద్రంలో డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో గురువారం వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమకాటు నుంచే మలేరియా, ఫైలేరియా, డెంగి, చికున్‌గున్యా, మెదడు వాపు వ్యా ధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. దోమలు తిరి గే ప్రదేశాల్లో స్ప్రే చేయించాలన్నారు. నిల్వ నీటిలో దోమలు వారం రోజుల్లో వృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీరంగాపూర్, జూలై 28 : డెంగీ అరికట్టడానికి ప్రజలు సహకరించాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ ప్రవళిక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోమలు వ్యాప్తి చెందకుండా అరికట్టాలని, నీరు నిల్వ కుండా గ్రామాల్లో అధికా లు, ఆశ కార్యకర్తలు ప్రత్యేక చర్యలు తీసుకొని గ్రామస్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎం పీపీ గాయత్రి, సర్పంచ్ వినీలరాణి, ఉపసర్పంచ్ శివ, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు, జూలై 28 : తిప్డంపల్లి ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో గురువారం డెంగీ నివారణపై అవగాహన ర్యాలీ ని ర్వహించారు. డెంగీ నివారణ మాసోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ ప్రదర్శన చేశా రు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి గాంధీచౌక్ వరకు సా గిన ర్యాలీలో విద్యార్థులు డెంగి నివారణపై అవగాహన క ల్పిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి సౌ భాగ్యలక్ష్మి, డాక్టర్ అక్షయ్‌కుమార్, సూపర్వైజర్ సురేందర్‌గౌడ్, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, ఆశ కార్యకర్తలు త దితరులు పాల్గొన్నారు.
పెద్దమందడి, జూలై 28 : మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి రాగికి ఆధ్వర్యంలో గురువారం డెంగీ నివారణపై వైద్య సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండలంలోని పలు వీధుల గుండా ర్యాలీ చేపట్టి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.