అయిజ, జూలై 28 : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతున్న ది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో టీబీ డ్యాంకు వరద భారీగా చేరుతున్నది. దీంతో అధికారులు 30 గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం డ్యాంలో 88,386 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 99,050 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వకుగానూ ప్రస్తుతం 105.306 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఈ నెలలో రెండోసారి డ్యాం 30 గేట్లను ఎత్తినట్లు పేర్కొన్నారు. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు 48,370 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 47,900 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో నమోదైంది. ఎగువ నుంచి వచ్చే వరద ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆయకట్టుకు 470 క్యూసెక్కులు వదిలినట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్ర స్తుతం ఆనకట్టలో 11 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
అమరచింత, జూలై 28 : జూరాల రిజర్వాయర్‌కు వరద తగ్గుముఖం పట్టింది. గురువారం సాయంత్రానికి 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. 30,635 క్యూసెక్కులను వినియోగిస్తూ విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.145 నీటి నిల్వ ఉన్నది. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500, భీమా-1కు 650, ఎడమ కాలువకు 920, కుడి కాలువకు 329, సమాంతర కాలువకు 150 క్యూసెక్కులు విడుదలవుతుండగా.. ప్రాజెక్టు నుంచి మొత్తంగా 34,274 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
శ్రీశైలం, జూలై 28 : శ్రీశైలం జలాశయానికి వరద నిలకడగా కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి నుంచి 30,635, సుంకేసుల నుంచి 33,088 క్యూసెక్కులు విడుదల కాగా, శ్రీశైలం జలాశయానికి సాయంత్రం 32,417 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నది. ఏపీ పవర్‌హౌస్‌లో 31,757, టీఎస్ పవర్‌హౌస్‌లో 31,784 క్యూసెక్కులతో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 185.5638 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.