నారాయణపేట, జులై 28: పోలీసులు ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొ న్నారు. గురువారం వీసీలో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల వివరాలు, ఫంక్షనల్ వర్టికల్ వాటి పనితీరు తెలుసుకున్నారు. వీసీలో పాల్గొన్న ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడు తూ జిల్లాలో పెండింగ్ కేసుల పరిష్కారం కోసం న్యాయాధికారులతో సమన్వయం చేస్తూ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పెండింగ్ కేసుల విషయంలో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని, సామాజిక అంశాలపై పోలీస్ కళాబృందంతో, షీటీమ్ పోలీసులతో అవగాహన కార్యక్రమా లు నిర్వహిస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, ఫంక్షనల్ వర్టికల్స్‌పై పోలీస్ అధికారులకు, సిబ్బందికి నిరంతరం వర్క్‌షాప్ నిర్వహిస్తూ సాంకేతికతను మెరుగుపర్చేకు కృషి చేస్తున్నామన్నారు.
అధికారులు, విలేజ్ పోలీస్ అధికారులు ప్రజలతో మమేకం కావాలని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోరీల నివారణకు నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని, రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకొని అధికారులు, సిబ్బం ది అప్రమత్తంగా ఉండాలన్నా రు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని, సైబర్ నేరాలు, బాల్యవివాహాలు, సీసీ కెమెరాలు, రోడ్డు భద్రత నియమాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ లు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, సీఐలు శ్రీకాంత్‌రెడ్డి, సీతయ్య, రాంలాల్, జనార్దన్, ఎస్సైలు పాల్గొన్నారు.
ఆపరేషన్ ముస్కాన్ 8లో భాగంగా బృందం అధికారులు జిల్లాలోని కోస్గి, మద్దూర్, దామరగిద్ద మండలాల్లో దాడులు నిర్వహించి 8మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందులో ఇద్ద రు అమ్మాయిలు ఉండగా, ఆరుగురు అబ్బాయిలు ఉన్నా రు. బాలకార్మికులను డీసీపీవో కార్యాలయంలో అప్పగించామని, తదుపరి పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపర్చి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని పేర్కొన్నారు. జిల్లాలో బాలకార్మికులు కనపడితే డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.