PCB | ఇండియాతో ఆడాలంటే.. 3 కీలక షరతులు పెట్టిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
Pakistan Cricket Board: టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియాతో ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న మ్యాచ్‌ను ఆడబోమని పాకిస్థాన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌ను ఆడాలంటే కొన్ని షరతులు పెట్టింది. ఐసీసీకి ఆ షరతులను వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఇస్లామాబాద్: టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియాతో ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న మ్యాచ్‌ను ఆడబోమని పాకిస్థాన్(Pakistan Cricket Board) చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌ను నిర్వహించేందుకు ఐసీసీ తమ వంతు ప్రయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇద్దరు సభ్యుల బృందం పాకిస్థాన్ వెళ్లింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మోషిన్ నఖ్వీతో చర్చలు నిర్వహించారు. భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు మూడు కీలక షరతులు పాకిస్థాన్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఓ మీడియా కథనం ప్రకారం ఆ షరతులు ఇలా ఉన్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు వార్షిక నిధులను ఐసీసీ పెంచాలని కోరింది. ఇక ఇండియా, భారత్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లను పునరుద్దరించాలని ఐసీసీని అభ్యర్థించింది. అయితే ఇండియా, పాక్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. ఆటగాళ్లు ఆన్‌ఫీల్డ్ ఎథిక్స్ పాటించాలని, ప్లేయర్లు అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలని పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరినట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్‌ను బహిష్కరించిన నేపథ్యంలో ఆ దేశానికి మద్దతు ఇస్తూ ఇండియాతో ఆడేందుకు పాకిస్థాన్ నిరాకరించిన విషయం తెలిసిందే.
ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలిసిన తర్వాత తుది నిర్ణయం వెల్లడించనున్నట్లు నఖ్వీ తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- India
- key conditions
- Pakistan
- PCB
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

