మక్తల్‌రూరల్,జూలై 28: సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించడానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మక్తల్ మండ లం గుర్లపల్లి గ్రామంలో 12మంది దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల విలువ చేసే ట్రాక్టర్లు, వరికోత యంత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, ఎంపీపీ వనజమ్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాడిత పీడిత అణగారిన వర్గాలను అభివృద్ధి చేసి వారిజీవితాల్లో వెలుగులు నింపడానికే దళితబంధు పథకాన్ని అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. దళితబంధు పథకం కింద మక్తల్ నియోజకవర్గానికి 100 యూనిట్లు మంజూరయ్యాయన్నారు . ఈ పథకంలో లబ్ధిదారుడివాటా కింద రూ.10 వేలు ‘రక్షణ నిధి’గా డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు. త్వరలో నియోజకవర్గానికి దళితబంధు ద్వారా మరో వెయ్యి యూనిట్లు మంజూరు చేయడానికి సీఎం అంగీకరించారని ఎమ్మెల్యే వెల్లడించారు.
లబ్ధ్దిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో దళిత బంధు పథకం విజయవంతంగా చేపట్టడం జరిగిందన్నారు. దళితబంధు పథకం కింద గుర్లపల్లి గ్రామానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, వరికోత యంత్రాలను అందజేయడంతో గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి గ్రామస్తులు తప్పెట్లమోతతో ఘన స్వాగతం పలికారు. అనంతరం తాయమ్మ గుడివద్ద ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చిట్టెం, జెడ్పీ చైర్ పర్సన్ వనజ, ఎంపీపీ వనజమ్మను శాలువా గజమాలతో ఘనంగా సన్మానించారు.
నిజంగా తమ జీవితాల్లో వెలుగులు నింపిన రోజని పలువురు లబ్ధ్దిదారులు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాగనూర్ జెడ్పీటీసీ వెంకటయ్య, స్పెషల్ ఆఫీసర్ జాన్ సుధాకర్, ఎంపీడీవో శ్రీధర్, ఎంపీవో పావని, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసుగుప్త, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహాగౌడ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ మక్తల్, మాగనూర్ మండల కమిటీ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి, సర్పంచ్ కళావతి, ఎంపీటీసీ తిమ్మప్ప, మీడియా కన్వీర్ ఈశ్వర్‌యాదవ్, నాయకులు గాలిరెడ్డి, శేఖర్‌రెడ్డి, సర్పంచ్‌లు దత్తప్ప, నర్సింహ పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, జూలై 28: తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులకు అన్నివిధాలా అండగా ఉందని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. గురువారం మక్తల్ పట్టణంలోని మినీస్టేడియంలో షూటింగ్ బాల్, టగ్‌ఆఫ్‌వార్, మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ క్రీడాకారులకు శిక్షణ పొందిన 25 మంది పీఈటీలకు రూ.20వేల విలువ గల షూస్‌ను ఎమ్మెల్యే చిట్టెం అందజేశారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, తాన్సింగ్, ప్రధాన కార్యదర్శి బి గోపాలం, బి శ్రీనివాసులు, అంజయ్యాచారి,పీఈటీలు అమ్రేశ్, దామోదర్, రమేశ్‌కుమార్, విద్యార్థులు క్రీడాకారులు పాల్గొన్నారు.
మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో పట్టణానికి చెందిన స్వాతి గూగుల్ కెరియర్ స్కాలర్షిప్కు ఎంపిక కావడంతో ఐటీ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న విద్యార్థి స్వాతిని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో మాగనూర్ జెడ్పీటీసీ వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్, శ్రీనివాస్ గుప్తా, జయరాములు, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు రైతులకు పుష్కలంగా సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మక్తల్ మండలం భూ త్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి రైట్కెనాల్ ద్వారా నర్వ, ఆత్మకూర్, అమరచింత, మండలాల రైతులకు సాగునీటిని ఎమ్మెల్యే చిట్టెం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీంఎం కేసీఆర్ కృషి, పట్టుదలతో మక్తల్ నియోజకవర్గంలోని రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం కింద, సంగంబండ (నర్సిరెడ్డి)భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను పూర్తిచేసుకున్నామన్నారు.
రాజీవ్‌భీమా ఫేజ్ (1)లో భాగమైన సంగంబండ, భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజార్వాయర్లను కృష్ణానది నుంచి గ్రావెటీ కెనాల్ ద్వారా నింపడం జరిగిందన్నారు. ఈఏడాది రెండు రిజర్వాయర్ల కింద లక్ష ఎకరాలకు సాగునీటిని అందించడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్, సర్పంచ్ హన్మంతు, టీఆర్ఎస్ నాయకులు శేఖర్‌రెడ్డి, వెంకటేశ్, ప్రాజెక్టు ఇంజినీర్లు వెంకటేశ్వర్లు, హమీద్ అబ్దుల్ వకీల్, రైతులు పాల్గొన్నారు.