మూసాపేట(అడ్డాకుల), జూలై 28 : సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని డీపీవో వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం అడ్డాకులలో పర్యటించి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్కువ రోజులపాటు నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. అనంతరం గ్రామపంచాయతీలో సమీక్ష నిర్వహించారు.
వీధుల్లో నీటినిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే పిచ్చిమొక్కలు, చెత్తాచెదా రం తొలగించాలని సూచించారు. దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించా రు. అదేవిధంగా కొవిడ్ బూస్టర్డోస్పై ఇంటింటి ప్ర చారం చేయాలని తెలిపారు.
అనంతరం సంకలమద్ది లో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపాల్ మంజులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా నివారణాధికారి విజయకుమార్, మండల ప్రత్యేకాధికారి రాధారోణి, ఎంపీడీవో మంజుల, డాక్టర్ రాకేశ్, ఎంపీవో విజయకుమారి, సీహెచ్‌వో భాస్కర్, మాజీ ఎంపీటీసీ భీమన్నయాదవ్, పంచాయతీ కార్యదర్శి నాగేశ్ పాల్గొన్నారు.
మహ్మదాబాద్, జూలై 28 : సీజనల్ వ్యాధులపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సరస్వతి, డీఎల్పీవో వరలక్ష్మి సూచించారు. మండలంలోని నంచర్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
దోమకాటుతో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు వ్యాపిస్తాయని, దోమల వృద్ధిని అరికట్టేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం గండీడ్ మండలంలోని మినీ గురుకులం, వసతిగృహాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో పారామెడికల్ అధికారి హన్మంతురావు, పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల, జూలై 28 : గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని గంగాపూర్ పీహెచ్సీ డాక్టర్ సమత సూచించారు. మండలంలోని పోలేపల్లిలో ఇంటింటికెళ్లి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్కువరోజులపాటు నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. వ్యా ధులు ప్రబలకుండా పరిశుభ్రత పాటించాలని కోరా రు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
నవాబ్‌పేట, జూలై 28 : మండలంలోని కూచూర్ లో వైద్యసిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పారిశుధ్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికెళ్లి సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీటీసీ విజయశ్రీ, నాయకులు భోజయ్యఆచారి, పిట్టల రవి, పంచాయతీ కార్యదర్శి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.