కులవృత్తులకు జీవం పోస్తూ సర్కార్ అండగా నిలుస్తున్నదని, స్వరాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లో జరిగిన మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడి మనెమోని సత్యనారాయణ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేలు డాక్టర్.సీ. లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మత్స్యకారులకు 11,500 ద్విచక్రవాహనాలతోపాటు ఇతర వాహనాలను అందించినట్లు గుర్తుచేశారు. హైదరాబాద్ తర్వాత మహబూబ్‌నగర్ అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటుందన్నారు.
మహబూబ్‌నగర్, జూలై 28 : మత్స్యకారులతోపా టు కులవృత్తిదారుల జీవితాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందని, గడప గడపకూ సంక్షేమ ఫలాలు అందుతుండడంతో నేడు పల్లెలు కళకళలాడుతున్నాయ ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మ త్స్య సహకార కార్యాలయంలో మత్స్య సహకార సం ఘం మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడిగా మనెమోని సత్యనారాయణను మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టిన రైతన్న తన సొంత గ్రామంలో లేకుండా పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాల్లో జీవనం సాగిస్తూ నానా పాట్లు పడిన రోజులకు కాలం చెల్లిందన్నారు. నేడు సాగునీరు పుష్కలంగా అందించడంతో దేశానికి అన్నపెట్టిన రైతన్న తన సొంత ఊరికి వస్తున్నాడన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో 11,500 ద్విచక్రవాహనాలతోపాటు ఇతర వాహనాలను అందించినట్లు గుర్తు చేశారు.
కుల, మత రాజకీయాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరకు రానివ్వకుండ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత మహబూబ్‌నగర్ అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 17గురుకులాలు మాత్రమే ఉండేవని, స్వరాష్ట్రంలో 1000గురుకులాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు.
తమ స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరితపిస్తుంటారని వారి మాటలను నమ్మకూడదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ప్రజలు స్వరాష్ట్ర పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఉమ్మడి పాలకులు చేసింది ఏమీ లేదని, వారి వ్యక్తిగత లాభార్జనే ధ్యేయంగా ముందుకు సాగారని పేర్కొన్నారు. కుల, మతాలు ఉన్నత స్థాయికి తీసుకుపోవని, అప్రమత్తంగా ఉంటూ అభివృద్ధి వైపు ముందుకు సాగాలని సూచించారు.
సబ్బండ వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రతి ఇం టికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని, ఎవరికి ఏ ఆపద వచ్చినా తక్షణమే స్పందించి వారికి మేలు జరిగేలా చూస్తామన్నారు. గతానికి ప్రస్తుతానికి బేరీజు వేసుకోవాలని పేర్కొన్నారు. మత్స్యకారులకు ఎల్లప్పు డూ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అనంతరం మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించా రు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహు లు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, భూత్పూర్ మున్సిపల్ చై ర్మన్ బస్వరాజ్‌గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, గ్రం థాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, భూత్పూర్ ఎంపీపీ కదిరే శేఖర్‌రెడ్డి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, కౌన్సిలర్ కిశోర్, నాయకులు మనోహర్, మత్స్యశాఖ సంచాలకులు రాధారోహిణి ఉన్నారు.
మహబూబ్‌నగర్ రూరల్, జూలై 28 : భిన్న మతా లు, కులాలకు మహబూబ్‌నగర్ నిలయంగా మారింద ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వ స్థలాలు, నిధులు అందించి అండగా ఉంటున్నామన్నారు. వీరన్నపేటలోని చౌడేశ్వరిదేవీ ఆలయం లో అమ్మవారి జయంత్యుత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఒకప్పుడు వెనుకబడిన వీరన్నపేట.. ఇప్పు డు డబుల్ బెడ్రూం కాలనీ, త్వరలో రానున్న బైపాస్ రోడ్డుతో వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. తొగట వీర క్షత్రియ సంఘానికి కమ్యూనిటీ హాల్ కోసం రూ.10లక్షల నిధులను మంజూరు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, సంఘం నేతలు చంద్రమౌలి, బాలయ్య, కురుమూర్తి, లక్ష్మీనారాయణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.