దేవరకద్ర రూరల్, జూలై 28 : రైతుబంధువైన సీఎం కేసీఆర్ సారుకు అండగా ఉండి ఎమ్మెల్యే ఆలన్న వెంట నడుస్తామని చిన్నచింతకుంట మండల బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అన్నారు. గురువారం చిన్న చింతకుంట మండల కేంద్రంలో ని 12వ వార్డుకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నుంచి 70 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో అనేక సంక్షేమ పథకాలు రూపొందించారన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతుబంధు పథకం లేదన్నారు. గతంలో నియోజకవర్గంలోని రెండు వాగులు ఎడారిని తలపించే విధంగా ఉండేవన్నారు. రూ.170 కోట్ల నిధులతో వాగులపై 21చెక్‌డ్యాంలు నిర్మించడంతో నేడు జీవనదులుగా మారాయన్నారు. దీంతో భూగర్భజలాలు పెరిగి, సాగు కూడా పెరిగిందన్నారు.
రాబోయే శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100కు పైగా సీట్లు సాధించడం ఖాయన్నారు. గాలి మాటలు చెప్పే ఇతర పార్టీ నాయకుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కార్యక్రమంలో జెడ్పీచైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు కోట రాము, సర్పంచ్ మోహన్‌గౌడ్ పాల్గొన్నారు.
తెలకపల్లి, జూలై 28 : మండలంలోని పెద్దపల్లి గ్రామానికి చెందిన ముస్లింలు కలిసికట్టుగా కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి హైదరాబాద్‌లో గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లోకి వలసలు వస్తున్నారన్నారు.కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.