దేవరకద్ర రూరల్, జూలై 24 : జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన కౌకుంట్ల మండల అభివృద్ధికి కృషి చేస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నా రు. కౌకుంట్లను మండలంగా ప్రకటించిన సందర్భంగా పలు గ్రామాల ప్రజాప్రతినిధు లు ఆదివారం భూత్పూర్ మండలం అన్నాసాగర్‌లో ఎమ్మెల్యే ఆలను కలిసి ఘనంగా సన్మానించడంతోపాటు మిఠాయిలు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ కౌకుంట్ల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని తె లిపారు. పార్టీలకు అతీతంగా నూతన మం డలాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అనంతరం జెడ్పీటీసీ అన్నపూర్ణ మా ట్లాడుతూ కౌకుంట్లను మండల ఏర్పాటుకు ఎమ్మెల్యే చేసిన కృషి మరువలేనిదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కౌకుంట్లను మండలకేంద్రం చేయడం సంతోషంగా ఉం దన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే ఆలకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
కౌకుంట్లను మండలకేంద్రం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ పుట్టపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అలాగే కౌకుంట్ల, రాజోళ్లి గ్రామాల్లో సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ సుజాత, సర్పంచులు స్వప్న, శ్రీనివాస్, కృష్ణవేణి, శివరాజు, మురళీధర్‌రెడ్డి, శ్రీనివాసులు, పీఏసీసీఎస్ డైరెక్టర్ కృష్ణగోపాల్, ఎంపీటీసీ కిష్టన్న, మాజీ ఎంపీపీ ఈవీ గోపాల్, నాయకులు శ్రీకాంత్, శేఖర్‌రెడ్డి, కిషన్‌రావు, రామకృష్ణ, శివకుమార్, విజయ్, నాగరాజు పాల్గొన్నారు.