ఖిల్లాఘణపురం, జూలై 20 : నూ తన విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుతో క రెంట్ సమస్యలు తొలగుతాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలో ని అల్లమాయిపల్లి గ్రామంలో నూతనం గా రూ.కోటీ60లక్షలతో నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం, రూ.80లక్షలతో 16 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మా ణ పనులకు భూమిపూజ చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలో నూతనం గా ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మండలంలోని అల్లమాయిపల్లి పరిధిలోని మల్కినియాన్‌పల్లి, ఈర్లతండా, సూర్యతండా, అప్పారెడ్డిపల్లి, బోడగట్టుతండాతోపాటు తదితర తం డాలకు కరెంట్ సమస్యలను ఎదుర్కొంటున్నారన్న సర్పంచుల సూచనల మేర కు సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఓ ముసలవ్వను నువ్వు ఏ నీరు తాగుతావని మంత్రి అడుగగా మిషన్ భగీరథ నీరు తాగుతానని మంత్రికి బదులిచ్చింది. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సామ్యానాయక్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ల క్ష్మారెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు.
కరెంటు ఇబ్బందులు ఉండవు
వనపర్తి రూరల్, జూలై 20 : విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఎక్కడికక్కడ సబ్‌స్టేషన్ నిర్మాణాలు చేపడుతున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అచ్యుతాపురం లో విద్యుత్ సబ్‌స్టేషన్, వాల్మీకి కమ్యూనిటీ భవనం ప్రారంభం, వైకుంఠధామం, పట్టణంలోని రాజనగరం శివారులోని 12వ వార్డులో విద్యుత్ స్టోర్, ఆర్డీవో కార్యాలయం ఆవరణలోని 6వ వార్డు లో మరో సబ్‌స్టేషన్ నిర్మాణాలకు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ కనెక్షన్‌కు దరఖాస్తు చే సుకున్న ప్రతి రైతుకు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అచ్యుతాపురం నుంచి చిట్యాల వరకు బీటీ రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని, సబ్‌స్టేషన్‌ను రూ.కోటీ 80 లక్షలతో నిర్మించనున్నట్లు తెలిపా రు. దరఖాస్తు చేసుకున్న వారికి తానే స్వయంగా వచ్చి ఆగస్టులో పింఛన్లు అందజేస్తానన్నారు. అలాగే అర్హులై కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్‌కార్డులు మంజూరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శారద, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ జగదీశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా శిక్షణ కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా కన్వీనర్ కురుమూర్తియాదవ్ ఉన్నారు.
క్రీడా ప్రాంగణాల ప్రారంభం
పెద్దమందడి, జూలై 20: విద్యార్థు లు, యువకులకు చదువుతోపాటు క్రీడ లు ఎంతో అవసరమని, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని పెం పొందిస్తాయని మంత్రి నిరంజన్‌రెడ్డి అ న్నారు. బుధవారం మండలంలోని చీకర్చెట్టుతండాలో నూతనంగా నిర్మించిన గిరిజన భవనాన్ని ప్రారంభించారు. మండలంలోని అల్వాల, దొడగుంటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. పెద్దమందడి మండల కేంద్రంలో రూ.75 లక్షలతో నిర్మించనున్న సర్వవర్గ సామూహిక భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలానికి సర్వవర్గ సామూహిక భవనాల నిర్మాణాలను చేపట్టనున్నట్లు చెప్పారు. సామూహిక భవనాల ఏర్పాటు ద్వారా అన్ని వర్గాల ప్రజల శుభకార్యాలకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రారంభించిందని విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు ప్రజలకు అవగాహన కల్పించి విద్యార్థుల నమో దు శాతాన్ని పెంచేలా కృషి చేయాలన్నా రు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రాజాప్రకాశ్రెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.