పెబ్బేరు రూరల్, జూలై 3 : దళితజాతి అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పెబ్బేరు జెడ్పీటీసీ పెద్దింటి పద్మ అన్నారు. ఆదివారం ఆమె మండలంలోని పలు గ్రామాల్లోని దళితవాడల్లో దళిత నా యకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు వనపర్తి మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఎత్తంరవి ఆధ్వర్యంలో దళితవాడల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణా ప్రభుత్వానికి దళితులపై ఎంత ప్రేమ ఉందో తెలియడానికి దళితబంధు పథకమే నిదర్శనమని తెలిపారు. దళితులు ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పథకం అమలవుతోందని ఆమె వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు భీమయ్య, కొమ్మువెంకటస్వామి, శివశంకర్, పరంజ్యోతి, మధు, దొడ్లరాములు, కురుమూర్తి, నాగరాజు, శరత్, పెద్దింటి వెంకటేశ్‌తోపాటు కార్య కర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
శ్రీరంగాపూర్, జూలై 3 : వ్వవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు మం డలస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి గ్రామాల్లో బూత్ లెవెల్ కమిటీలు ఏ ర్పాటు చేస్తున్నామని సింగిల్ విండో అధ్యక్షుడు జగన్నాథంనాయుడు అన్నారు. మండలంలోని నాగరాల గ్రామంలో ఆదివారం బూత్ లెవెల్ సమావేశం నిర్వ హిం చారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయిలో ప్రజలకు బూత్ లెవల్ కమిటీలు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం రైతుబంధు నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు మహిళలు, రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్, వ్వవసాయ శాఖ మం త్రి నిరంజన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు వెంకట్‌స్వామి, వైస్‌ఎంపీపీ మహేశ్వర్‌రెడ్డి, కోఆప్షన్ మెంబర్ ఆరీఫ్, సర్పంచ్ నిర్మలా రాధాకృష్ణతోపాటు గ్రామ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నా యకులు తదితరులు పాల్గొన్నారు.