చారకొండ, జూలై 3: చారకొండలో నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేసి గీత కార్మికులకు జీవనోపాధి కల్పిండమే ప్రభుత్వ లక్ష్యమని ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దత్తురాజుగౌడ్ అన్నారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశాల మేరకు చారకొండలో నీరా ప్రాజెక్టు ఏర్పాటుకు గీత కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారకొండలో అధికంగా గౌడ కులస్తులు తమవృత్తిపై ఆధారపడి జీవనం గడుపుతున్నారని గుర్తించినట్లు తెలిపారు. నీరా ప్రాజెక్టు ఏర్పాటుతో ఈ ప్రాంత గీత కార్మికులకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు.
నీరాలో ఆరోగ్యవంతమైన ఔషధాలు ఉన్నాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తెలిందన్నారు. గీత కార్మికులు సొసైటీ ఏర్పాటు చేసుకొని నీరా సేకరణ చేసుకోవాలన్నారు. నీరా ప్రాజెక్టు ఏర్పాటుకు గీత కార్మికులు సహకరించాలన్నారు. అనంతరం చారకొండ సర్పంచ్ విజేందర్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ గురువయ్యగౌడ్తో కలిసి నీరా ప్రాజెక్టు ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రంగారెడ్డి జిల్లా అధికారి చంద్రయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎండీ ఫయాజొద్దీన్, కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ శంకర్, ఎస్సై వెంకటేశ్, టీఆర్ఎస్ యువజన నాయకుడు చండీశ్వర్, నాయకులు జెల్ల కృష్ణయ్య, సవారి జంగయ్య, పీసీలు గణేశ్, పరశురాం, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.