ఇటిక్యాల, జూలై 3: లౌకికవాదానికి విఘాతం కలిగించే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రాష్ర్ర్టానికి రావాల్సిన నిధులను రాబట్టేందుకు కృషిచేస్తానని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి మంద జగన్నాథం పేర్కొన్నారు. మండలంలోని కొండేర్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కులతత్వ, మతతత్వవాదిగా వ్యవహరిస్తూ సమాజానికి ప్రమాదకరంగా మారిన బీజేపీ తీరును ఎక్కడికక్కడ ఎండగడుతూ లౌకికవాద పార్టీ మద్దతును కూడగట్టేందుకు పాటుపడుతానన్నారు.
పాలనలో గుణాత్మక మార్పును తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్న పోరాటంలో భాగస్వామినవుతానన్నారు. జాతీయ పార్టీ ఏర్పాటవుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారని, పార్టీ ఉన్నతికి నిరంతరం కృషిచేస్తానన్నారు. అదేవిధంగా మంద జగన్నాథంను నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అభినందించి సన్మానించారు.
కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి మంద శ్రీనాథ్, జోగుళాంబ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఇటిక్యాల మాజీ జెడ్పీటీసీ సుందర్, కలుగొట్ల తేజ, ఇస్మాయిల్, నతానియేల్, నాగన్న, పల్లెపాడు శంకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, సుదర్శన్‌గౌడ్, వెంకట్రామయ్యశెట్టి, నర్సన్‌గౌడ్, పెద్దముక్తార్, చిన్నముక్తార్, నర్సింహారెడ్డి, జితేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరలు పాల్గొన్నారు.