మహబూబ్‌నగ ర్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ధరణి పోర్టల్ ద్వారా స మస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం.. దరఖాస్తులను ఎప్పటికప్పుడు తాసిల్దార్లు, రెవెన్యూ అధికారులతో సం ప్రదించి.. వీడియో కాన్ఫరెన్స్ ని ర్వహించి పెండింగ్‌లో లేకుండా చూ స్తున్నాం..’ అని మహబూబ్‌నగర్ కలెక్ట ర్ ఎస్.వెంకట్రావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రారంభించి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా శనివా రం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు.
నమస్తే తెలంగాణ : ధరణిలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయనే అపోహ ఉన్నది. ఇది నిజమేనా..?
కలెక్టర్ : ఇది పూర్తిగా నిరాధారం. జిల్లాలో పార్ట్ బీ కింద 35,589 దరఖాస్తులు వచ్చాయి. అందులో 34, 877 దరఖాస్తులను పరిష్కరించాం. కేవలం రెండు శా తం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. కింది స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరిస్తున్నాం. తాసిల్దార్లు, రెవెన్యూ అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మొదటి ప్రాధన్యత ఇచ్చి పార్ట్ బీ దరఖాస్తులను పరిష్కరిస్తున్నాం.
ధరణిలో ఎన్ని రకాల లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు..?
ధరణి పోర్టల్‌లో 33 రకాల లావాదేవీలకు వీలున్నది. పది రకాల ఇన్ఫర్మేషన్ మాడ్యుల్స్ ఉన్నాయి.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు ఎంత సమయం పడుతుంది..?
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చాలా సులభంగా నిమిషాల్లో పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఈ పాస్‌బుక్‌లు జారీ చేస్తున్నాం. భూ యజమానులకు అందుబాటులో ఉంచడం ద్వారా ధరణిపై ప్రజలకు పూర్తి స్థాయిలో నమ్మకం వచ్చింది.
ఈ రెండేండ్లలో జిల్లాలో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయి.. ఎంత ఆదాయం వచ్చింది..?
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ప్రారంభమై రెండేండ్లు అవుతున్నది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటివరకు 61,245 లావాదేవీలను పూర్తి చేశాం. రూ.10,61,91,268 ఆదాయం సమకూరింది.
వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటే భూ యాజమాన్య హక్కులు బదిలీ అవుతున్నాయా?
ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవసాయ భూములకు అప్పటికప్పుడే మ్యుటేషన్ చేయడంతోపాటు తాత్కలిక పాస్ బుక్కులను ఇస్తున్నాం. 15 రోజుల్లో స్పీడ్ పోస్టు ద్వారా పట్టదారు పాసుపుస్తకాలు యజమానులకు అందుతున్నాయి.
ధరణి పోర్టల్‌పై ప్రజల్లో ఇంకా అనేక అనుమానాలున్నాయి.. చాలా మంది విమర్శిస్తున్నారు. దీనిపై ఏమంటారు..?
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి సమీకృత భూ రికార్డుల అధికారిక రిజిస్ట్రేషన్ పోర్టల్. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్స్, ఆస్తుల బదాలాయింపునకు చక్కని మార్గంగా పనిచేస్తున్నది. రిజిస్ట్రేషన్‌లో పూర్తి బాధ్యత, పారదర్శకతకు ఇది నిదర్శనం.
ధరణిలో అనేక లొసుగులు ఉన్నాయని, రికార్డులకు భద్రత లేదని, చాలా మంది అంటున్నారు.. నిజమేనా?
రికార్డుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేని సేవలను రైతులకు అందించడమే లక్ష్యంగా ధరణిని ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్న లొసుగులను తొలగించడం, అసైన్డ్ భూముల సమాచారాన్ని ఆన్లైన్లో ఉంచుతున్నారు. ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిమిషాల్లో పూర్తి చేయడం ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. రికార్డుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదు.