మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 2 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహం సమీపంలో అమర వీరుల స్తూపం వద్ద రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి మహ బూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ అబ్జర్వర్ ఏ.వాణి ప్రసాద్, కలెక్టర్ రవినాయ క్, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ పూల మా ల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంత రం మహబూబ్‌నగర్ జిల్లా సమీకృత కలెక్టరే ట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
నారాయణపేట టౌన్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. రాష్ట్ర దశా బ్ది ఉత్సవాల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ శ్రీహర్ష, ఎస్పీ యోగేశ్‌గౌతమ్ పూలమాల వేసి అమరవీరులకు నివాళులర్పించారు. అనంత రం కలెక్టర్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమంలో పాలుపంచుకున్న వారికి అభినందనలు తెలిపారు. అమరుల ఆశయాలు, ఆకాంక్షల మేర కు జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ఆర్డీవో మధుమోహన్, డీఎస్పీ లింగయ్య, జెడ్పీ సీఈవో జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల, జూన్ 2 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వ వేడుకలను ఆదివారం జడ్చర్ల మండలంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం బాదేపల్లి జెడ్పీహెచ్ఎస్లో నిర్వ హించిన వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. అదేవిధం గా జడ్చర్లలోని కోర్టు ఆవరణలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లక్ష్మి మహా త్మాగాంధీ, ఆచార్యజయశంకర్, తెలంగాణ తల్లి చిత్రప టాలకు పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కో ర్టు జడ్జి ముద్దాసలి, జడ్చర్ల అడ్వకేట్ అసోసి యేషన్ అధ్యక్షుడు జంగయ్య, యాదిరెడ్డి, విశ్వేశ్వర్, మహేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రా ములు, తిరుపతి పాల్గొన్నారు. జడ్చర్లలోని భూసారపరీక్షా కేంద్రంలో ఏడీఏ ఆంజనేయు లుగౌడ్, వ్యవసాయ కార్యాలయంలో ఏడీఏ ఆంజనేయులు, పీఏసీసీ ఎస్‌లో చైర్మన్ సుద ర్శన్గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
మక్తల్ టౌన్, జూన్ 2 : అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను పురసరించుకొని ఆ దివారం మక్తల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల యం వద్ద ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి జాతీయ జెండాను ఆవిషరించారు. అదేవిధంగా మండలకేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాల యాలు, పాఠశాలలు, పోలీస్‌స్టేషన్ వద్ద అధి కారులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమాల్లో తాసీల్దార్ సు వర్ణరాజ్, ఎంపీడీవో గోవిందరావు, సీఐ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ పావని, అధికా రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మరికల్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీకళ, పోలీస్‌స్టేషన్ వద్ద సీఐ రాజేందర్, తాసీల్దార్ కార్యాలయం వద్ద సునీతతోపాటు వివిధ కార్యాలయాల వద్ద అధికారులు, పాఠశాలల వద్ద ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, జూన్ 2 : పట్టణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
నారాయణపేటరూరల్, జూన్ 2 : నారాయణపేట మండలంలోని అప్పిరెడ్డిపల్లి, జా జాపూర్, సింగారం, అప్పక్‌పల్లి, పేరపళ్ల, కొ ల్లంపల్లి , ఊటకుంటతండా, పిలిగుండ్లతండాల్లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేం ద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ రాణాప్రతాప్సిం గ్, ఎంఆర్సీలో, విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో అబ్దుల్గని , లేబర్ కార్యాలయంలో లెబర్ ఆఫీసర్ రాజ్‌కుమార్ జాతీ య పతాకా న్ని ఎగురవేశారు. అదేవిధంగా అన్ని గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయా లు, పాఠశాలలు, రైతువేదికల వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమాల్లో వివి ధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ నాయకులు, కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
మద్దూర్ (కొత్తపల్లి), జూన్ 2 : మద్దూర్, కొత్తపల్లి మండలాల్లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. మండల పరిషత్, తాసీల్దార్, పీఏసీసీఎస్, మండల వ్యవసాయశాఖ కార్యాలయాలతోపాటు పోలీస్ స్టేషన్లో కూడా జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యాలయంలో ఆ యా శాఖల అధికారులు పాల్గొన్నారు.
బాలానగర్, జూన్ 2 : తెలంగాణ ఆవిర్భా వ వేడుకలను ఆదివారం బాలానగర్ మండ లంలో ఘనంగా నిర్వహించారు. తాసీల్దారు కార్యాలయం, పోలీస్‌స్టేషన్, మండల పరిష త్, వ్యవసాయశాఖ, పీఏ సీసీఎస్, విద్యా సంస్థలు తదితర కార్యాలయాల్లో తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా జాతీయ జెండా ను ఎగురవేశారు. మహాత్మాగాంధీ విగ్రహానికి నా యకులు, అధికారులు పూలమాల వేసి నివా ళులర్పించారు. కార్యక్రమాల్లో తాసీల్దార్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ తాసీల్దార్ లిఖితారెడ్డి, ఎంపీపీ కమల, జెడ్పీటీసీ కల్యాణి, ఎంపీడీవో శరత్చంద్రబాబు, ఎస్సై తిరుపాజీ, ఆర్ఐ వెం కట్రెడ్డి, ఏవో ప్రశాంత్‌రెడ్డి, ఏపీవో రాజశేఖర్ రెడ్డి, ఏపీఎం నాగరాజు తదితర శాఖల అధికా రులతో పాటు నాయకులు లక్ష్మణ్‌నాయక్, జగన్నాయక్, వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, హరిసింగ్, శంకర్‌నాయక్, దత్తాత్రేయ, లక్ష్మ య్య, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్, జూన్ 2 : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం అన్ని గ్రామా ల్లో ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల లు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద దేశ నాయకులు, జయశంకర్ చిత్రపటానికి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. మండల పరిష త్ కార్యాలయం దగ్గర ఎంపీడీవో ధనుంజయ గౌడ్, తాసీల్దార్ కార్యాలయం వద్ద తాసీల్దార్ మమత, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై శ్రీనివాసు లు, పీఏసీసీఎస్ కార్యాలయం దగ్గర విండో చైర్మన్ బాల్‌రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యాల యాల వద్ద ప్రత్యేక అధికారులు, పాఠశాలల వద్ద ప్రధానోపాద్యాయులు జాతీయ జెండాల ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, మాజీ సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, సూరయ్యగౌడ్ పాల్గొన్నారు.
హన్వాడ, జూన్ 2 : తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఆదివారం మండలంలోని వివిధ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠ శాలల వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమాల్లో తాసీల్దార్ కిష్టానాయక్, ఎంపీ డీవో యశోదమ్మ, ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీ సీ విజయనిర్మలతోపాటు వివిధ పార్టీల నాయ కులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కృష్ణ, జూన్ 2 : మండల వ్యాప్తంగా తెలం గాణ దశాబ్ది వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయా లు, పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, పీ ఏసీసీఎస్ కార్యాలయంల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమాల్లో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయు లు గ్రామస్తులు పాల్గొన్నారు.
మూసాపేట, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. అడ్డాకులతో పాటు వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీ య జెండా ఆవిష్కరించి, స్వీట్లు పంచా రు. కార్యక్రమంలో ఆయా మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, యువకు లు, మహిళలు పాల్గొన్నారు.
దేవరకద్ర, జూన్ 2: మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీ య జెండాను ఎగురవేసి, అమరవీరులకు నివాళులర్పించారు. తాసీల్దార్ కార్యాలయం లో తాసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ రమాదేవి, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల వద్ద జాతీయ జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, వివిధ శా ఖల అధికారులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), జూన్ 2: కౌకుంట్ల, చిన్నచింతకుంట మండల కేంద్రాల తో పాటు అన్ని గ్రామాల్లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రైతువేదికలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేశారు. మిఠాయిలు పంపిణీ చేశారు.
మూసాపేట(అడ్డాకుల), జూన్ 2: అడ్డాకులలో తెలంగాణ సిద్ధ్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పార్టీలకతీతంగా నాయకులు పాల్గొ ని అడ్డాకుల బస్టాండ్ ఆవరణలో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
భూత్పూర్, జూన్ 2: ఎందరో త్యాగధనుల ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అని మున్సిపాలిటీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ అన్నా రు. ఆదివారం ఆయన మున్సిపాలిటీ కార్యాలయంలో జెండావిష్కరణ చేశారు. అదేవిధం గా ఎంపీడీవో, తాసీల్దార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, విద్యుత్ సబ్‌స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జెండావిష్కరణ చేశారు. వేడుకల్లో తాసీల్దార్ రాజు, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సురేందర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, డాక్టర్ రబ్బు, డాక్టర్ మధుసూద న్, మాజీ ఎంపీపీ సత్తూర్ చంద్రశేఖర్‌గౌడ్, మాజీ సర్పంచు సత్తూర్ నారాయణగౌడ్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూన్ 2: రెడ్‌క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో తెలంగాణ ఆవిర్భా వ దినోత్సవం ఘనంగా నిర్వమించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ డా.నటరా జ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంత రం అనాథ ఆశ్రమంలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ డాక్టర్ శామ్యూల్, సభ్యులు జగపతిరావు, ఉ మేశ్, నర్సింహ, లత, వెంకటేశ్వరమ్మ, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూన్ 2 : తె లంగాణ ఆవిర్భావ దినోత్సవం సం దర్భంగా ఆదివారం మహబూబ్‌నగర్‌లోని డీఐజీ కా ర్యాలయంలో జోగుళాంబ జోన్ డీఐజీ ఎస్ఎల్ చౌహాన్ జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్‌తోపాటు డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాము లు, ఏఆర్ ఏఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, ఏవోతోపాటు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని డీసీసీబీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీబీ ఇ న్చార్జి అధ్యకుడు వెంకటయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. బ్యాంకు సీఈ వో లక్ష్మయ్య, బ్యాంకు ఏజీఎం రాజు, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మేనేజర్ రవితోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
మాగనూర్, జూన్ 2 : తెలంగాణ ఆ విర్భావ వేడుకలు ఆదివారం ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా అ న్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో జాతీయ జెండా ను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీ పీ శ్యామలమ్మ, జెడ్పీటీసీ వెంకటయ్య, మాజీ సర్పంచ్ రాజు, ఎంపీవో జైపాల్‌రెడ్డి, తాసీల్దార్ సతీశ్‌కుమార్, వైస్‌ఎంపీపీ తిప్పయ్య, సింగిల్‌విండో చై ర్మన్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
కోస్గి, జూన్ 2: స్థానిక తాసీల్దార్, ఎం పీపీ, వ్యవసాయ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాలతోపాటు పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ క మిషనర్ శశిధర్, వ్యవసాయాధికారి రా మకృష్ణతోపాటు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ధన్వాడ, జూన్ 2 : మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో తెలంగాణ ఉత్సవాలు నిర్వహించారు. అన్ని ప్రభు త్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, పాఠశాలల వద్ద జాతీయ జెండా ను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీ పీ పద్మాబాయి, తాసీల్దార్ సింధూజ, ఎంపీడీవో సాయిప్రకాశ్, సీఈవో వెంకట్రాములు, విండో ఉపాధ్యక్షుడు బాలరాజు, నర్సింహానాయుడు, సీటీ రమేశ్, శ్రీనివాస్‌సాగర్, వైద్యాధికారి కీర్తి పాల్గొన్నారు.
నవాబ్‌పేట, జూన్ 2 : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఆవిర్భావ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్, రెవెన్యూ, పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ ధవాఖాన, ఐకేపీ, గ్రామ పంచాయతీ, సింగిల్‌విండో, ఎమ్మార్సీ కార్యాలయాల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, తాసీల్దార్ నాన్యనాయక్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏవో గోపీకృష్ణ, ఎస్సై అభిషేక్‌రెడ్డి, డా.నరేష్చంద్ర, ఏపీ ఎం, మాజీ జెడ్పీటీసీ రంగారావు, నాయకులు లక్ష్మయ్య, బంగ్లారవి పాల్గొన్నారు.