జడ్చర్ల, జూన్ 6 : జడ్చర్లలో నూతనంగా నిర్మించిన డీసీ ఎం అసోసియేషన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మా రెడ్డి ప్రారంభించారు. డీసీఎం అసోసియేషన్ కార్యాల యం కోసం ఎమ్మెల్యేను కోరగా వ్యవసాయ మార్కెట్ యార్డుకు వెనుక భాగంలో స్థలం కేటాయించారు. నిర్మాణ పనులు పూర్తి కావడంతో సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఎమ్మెల్యే పూజ నిర్వహించా రు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిప ల్ చైర్పర్సన్ లక్ష్మి, మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మయ్య, మా ర్కెట్ డైరెక్టర్లు సుభాష్, పవన్, కౌన్సిలర్లు, కార్మిక సంఘం నాయకులు, డీసీఎం అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, శంకర్‌నాయక్, దోనూరు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థినికి చేయూత
బాలానగర్, జూన్ 6 : మండలంలోని పెద్దబాయితండాకు చెందిన పేద గిరిజన కుటుంబానికి చెందిన సునీత ఎంబీబీఎస్ రెండో ఏడాది చదువుతున్నది. ఆమె ఉన్నత చ దువు నిమిత్తం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేయూతనిందించారు. సోమవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే స్వగృహంలో సునీతకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రూ.25 వేలు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జగన్నాయక్, రాములు, నర్సింహులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
మిడ్జిల్, జూన్ 6 : బొడ్రాయి పండుగను కులమతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో ని ర్వహించుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని వస్పూల్లో నిర్వహిస్తున్న శీతలాపరమేశ్వరీదేవి(బొడ్రాయి), కోట మైసమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠ ఉత్సవాల్లో సోమవారం ఎమ్మెల్యే పా ల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో పండుగ నిర్వహించుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యేతోపాటు ప్రజాప్రతినిధులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
ఎంపీటీసీ మాసమ్మకు నివాళి
రాజాపూర్, జూన్ 6 : టీఆర్ఎస్ పార్టీకి చెందిన కుచ్చర్కల్ ఎంపీటీసీ ఎర్ర మాసమ్మ(60) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సోమవారం స్థానిక నాయకులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లి మాసమ్మ పార్థివదేహంపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, ఎంపీ పీ సుశీల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, సర్పంచ్ రాధ, నాయకులు వెంకట్రామ్రెడ్డి, శేఖర్‌గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.