ఊరుకోండ : మండలంలోని మాధారం నుంచి రాచాలపల్లి వరకు నిర్మిస్తున్న రోడ్డును వెంటనే పూర్తి చేయాలని చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. బీజేపీ సీనియర్ నాయకులు బొల్గం నరేందర్ గౌడ్ ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి ఆదివారం మద్దతు పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ( Elections ) ఇచ్చిన హామీ మేరకు రోడ్డును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ( MLA Anirudh Reddy ) శంకుస్థాపన చేసినా నేటికి ఎలాంటి పనులు ప్రారంభానికి నోచుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం యంత్రాంగం రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దుర్గ ప్రసాద్,నాగర్ కర్నూల్ బీజేపీ కార్యదర్శి రాఘవేందర్ గౌడ్, బీజేపీ యువ నాయకులు దివాకర్ గౌడ్, ప్రశాంత్, గ్రామస్థులు జంపులు సత్యనారి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.