మరికల్, మార్చి 26 : మండలంలోని చిత్తనూర్ సమీపంలోని జురాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ వద్ద బుధవారం లారీ డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. వారం రోజుల నుంచి లారీల్లో ఉన్న ధాన్యాన్ని కంపెనీ యజమాన్యం అన్లోడ్ చేసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇథనాల్ తయారీకి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం నుంచి సుమారు 200 లారీల్లో జొన్న, బియ్యం, నూకలు, మొక్కజొన్న ధాన్యం వచ్చి వారం రోజులు అవుతున్నా కంపెనీ యజమానుల నిర్లక్ష్యం వల్ల ఎక్కడికక్కడ లారీలు ఆగిపోయాయి. లారీల్లోని ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవాలని బతిమాలుతున్నా అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల డ్రైవర్లు అందరూ పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. కనీసం తాగేందుకు నీళ్లు, తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు. యజమాన్యం వెంటనే అన్లోడ్ చేసుకోవాలని లారీ డ్రైవర్లు కోరుతున్నారు.
ఐదు రోజులుగా ఎండలోనే ఉంటున్నాం..
కంపెనీలో డ్రైవర్లకు కనీస వసతులు లేవు. ఎండలోనే ఉం టున్నాం. నేను తెనాలి నుంచి జొన్న లోడుతో ఐదు రోజుల కిందట వచ్చాను. అన్లోడ్ చేస్తే వెళ్లిపోతామని చెప్పినా కంపెనీ వారు లారీలోని లోపలికి పోనివ్వడం లేదు. తినడానికి డబ్బులు కూడా లేవు.
– చాంద్‌పాషా, లారీ డ్రైవర్, తెనాలి,ఆంధ్రప్రదేశ్
తిండిలేక చచ్చే పరిస్థితి వచ్చింది..
తినడానికి తిండి లేక చచ్చే ప రిస్థితి వచ్చింది. కంపెఎనీ దగ్గర కు వచ్చి వారం రోజులైంది. కం పెనీలో తిండి లేదు, వంట చేసుకోవడానికి సిలిండర్‌లో గ్యాస్ లేదు. వారం రోజుల నుంచి కం పెనీ వారిని అన్లోడ్ చేసుకోమ్మని బతిమాలుతున్నా పట్టించుకోవడం లేదు. కంపెనీకి సరుకు అవసరం లేదని రాసిస్తే తిరిగి వెళ్తాం.
– శ్రీనివాస్‌రావు, డ్రైవర్, తెనాలి, ఆంధ్రప్రదేశ్,