గద్వాల/అయిజ/శ్రీశైలం, ఆగస్టు 7 : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. బుధవారం జూరాలకు 2.75 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 39 గేట్లు, కాల్వల ద్వారా 2,88,302 క్యూసెక్కులను వదిలారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీ ఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.434 టీఎంసీలుగా ఉన్నది.
జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. కర్ణాటకలోని టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 60,203, అవుట్‌ఫ్లో 60,203 క్యూసెక్కులుగా నమోదైంది. 105.788 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యానికిగానూ ప్రస్తుతం 103.740 టీ ఎంసీలు ఉన్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 48,370, అవుట్‌ఫ్లో 47,600 క్యూసెక్కులుగా ఉన్నది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 670 క్యూసెక్కులు వదలగా.. ప్రస్తుతం ఆ నకట్టలో 11 అడుగుల నీటి మట్టం ఉన్నది.
అలాగే కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 2,95,580, అవుట్ ఫ్లో 2,02,641 క్యూసెక్కులుగా ఉన్నది. గరిష్ఠస్థాయి నీ టి నిల్వ 129.72 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 94.365 టీఎంసీలుగా ఉన్నది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇ న్‌ఫ్లో 2,05,000, అవుట్‌ఫ్లో 2,00,620 క్యూసెక్కులు గా నమోదైంది. గరిష్ఠస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 27.688 టీఎంసీలు ఉన్నది.
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి 2,81,344 క్యూ సెక్కుల వరద చేరుతుండగా.. పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,09,420 క్యూసెక్కులను వదిలారు. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాలకు 64,768 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 202. 9673 టీఎంసీలుగా నమోదైంది.
‘సంగంబండ’ గేట్లు ఎత్తివేత
మక్తల్, ఆగస్టు 7 : సంగంబండ రిజర్వాయర్ పరిధి లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో భారీగా వరద వస్తున్నది. దీంతో బుధవారం నీటి పారుదలశాఖ అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్‌కు 3 వేల క్యూసెక్కుల వరద రా గా.. గేట్ల నుంచి 2 వేల క్యూసెక్కులను వదిలారు. నీటి విడుదల సందర్భంగా వాగు పరివాహక ప్రాంతాలైన గు ర్లపల్లి, దాసరిదొడ్డి, వరూర్, మాగనూర్, అడవి స త్యారం గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రిజర్వాయర్‌ను సందర్శించారు.