మాగనూరు : పోలీసుల బందోబస్తు ( Police Security ) మధ్య మాగనూరు మండలం కోల్పూర్ గ్రామంలో లిఫ్ట్ ప్రెసిడెంట్(Lift President ) ఎన్నిక జరిగింది. నారాయణపేట జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతమైన మాగనూరు మండలం కొలుపూర్ గ్రామంలో ముడుమాలు ఎత్తిపోతల పథకం( Mudumalu Lift Irrgation ) బి లిఫ్ట్ కింద పంటలు సాగు చేసుకుంటున్న ఫార్మర్ అసోసియేషన్‌కు లిఫ్ట్‌ను అప్పజెప్పారు.
ఎత్తిపోతల పథకం పరిధిలో కోల్పూర్, మంది పల్లి, గాజురం దొడ్డి, అడవి సత్యారం, పరమం దొడ్డి, రైతులు దాదాపు 800 నుంచి 1000 ఎకరాలపైనే పంటలు సాగు చేసుకుంటున్నారు. గత 20 సంవత్సరాలు గా ఐదు గ్రామాలకు చెందిన రైతులు లిఫ్ట్ ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటూ వస్తున్నారు. ఇదివరకు పనిచేసిన అధ్యక్షులు సుమారు రూ. 60 లక్షలకు సరైన లెక్కలు చూపించడం లేదని ఆరోపిస్తూ బుధవారం నూతన అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ ఎన్నికలో కమ్మరి వెంకటేశ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గతంలో పనిచేసిన లిఫ్ట్ ప్రెసిడెంట్ల లెక్కలపై ఆడిట్ విచారణ చేపట్టాలని ఆయకట్టుదారులు వెల్లడించారు.