Leopard | చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు
Leopard | జిల్లాలో మూడు నెలలుగా కలవరపెడుతున్న చిరుత సంచారం సీసీ ఫుటేజ్‌లో జాడ తెలిసింది
జోగులాంబ గద్వాల : జిల్లాలో మూడు నెలలుగా కలవరపెడుతున్న చిరుత సంచారం సీసీ ఫుటేజ్‌లో జాడ తెలిసింది . జిల్లాలోని మల్దకల్ మండలంలో చిరుత ( Leopard ) సంచరిస్తున్నట్లు ఫారెస్టు అధికారులు గుర్తించారు. మండలంలోని పలు గ్రామాల్లో మూగ జీవాలపై గుర్తు తెలియని జంతువు దాడి చేసి చంపేస్తుంది. దీనిపై ఆందోళన చెందిన రైతులు జిల్లా అటవీశాఖ అధికారులకు ( Forest Officials ) సమాచారం అందించారు.
తాజాగా నేతువానిపల్లి గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు అనుమానించడంతో
చిరుత కదలికలను గమనించేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు గురువారం నేతువానిపల్లి అటవీ ప్రదేశంలో ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చనిపోయిన ఓ మూగ జీవిని అటవీలో వేసి సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షించారు. మూగజీవిని చిరుత పులి దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇప్పటి వరకు గ్రామ శివారులో 8 జంతువులు చిరుత దాడిలో మృతి చెందాయి.
చిరుతను బందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఎప్పుడు ఏవిధంగా దాడిచేస్తుందోనంటూ స్థానికులు ప్రతి నిత్యం భయంతో బెంబెలెత్తిపోతున్నారు. శుక్రవారం అటవీప్రాంతంలో అధికారులు పర్యటించి మరో సారి చిరుత కదలికలపై నిఘా పెట్టారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

