మల్దకల్, ఏప్రిల్ 11 : మండలంలోని నేతువానిపల్లి గ్రామంలో పులిదాడిలో ఓ గొర్రె మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం గొర్రెల కాపరి చింతపండు సవారన్న తనకున్న గొర్రెలను తన పొలం వద్ద గొర్రెల మందను ఆపి రాత్రి వెళ్ల కంచె కట్టి ఇంటికి వచ్చాడు. శుక్రవారం రాత్రి 10గంటల సమయంలో గొర్రెల మందపై పులిదాడి చేయగా ఓ గొర్రె మృతి చెందిందన్నారు.
ఈ విషయంపై ఫారెస్టు రెంజ్ ఆఫీసర్ ఫర్వేజ్ ఆహ్మద్ను వివరణ కోరగా మూడునెలలుగా ఇలాంటి ఘటనలు నేతువానిపల్లి గ్రామ శివారు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయన్నారు. ఎండకాలం కావడంతో వాటి జాడలు నేటి వరకు కనిపించకపోవడంతో పులి అని నిర్ధారణ చేయలేదన్నారు. అయితే వారంరోజుల కిందట అటవీ ప్రాంతంలో సోలార్ సహాయంతో సీసీ కెమెరాను అమర్చినట్లు తెలిపారు.
ఈ కెమెరాలో చిరుతపులి అని నిర్ధారణ అయిందన్నారు. దీనిని పట్టుకునేందుకు ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే దానిని పట్టుకుంటామన్నారు. గొర్రెను చిరుత చంపిదా లేక ఏదైన జంతువు చంపిదా అనేది పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్ధారణ చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే చిరుత దాడిలో చనిపోయిన పశువులకు ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారం అందించేందుకు కృ షి చేస్తున్నట్లు తెలిపారు.