జడ్చర్ల : బీసీ రిజర్వేషన్ల ( BC Reservations ) సాధనకు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ( Lakshma reddy ) తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ అంబేద్కర్ చౌరస్తాలో బీసీ జేఏసీ, బీసీ జాగృతి సేన, బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యాన స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్ట బద్ధతతో కూడిన 42శాతం రిజర్వేషన్ల సాధనకు చేపట్టిన సంతకాల సేకరణలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హాజరై సంతకం చేశారు. బీసీలు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగించాలని సూచించారు. పార్టీల పరంగా రిజర్వేషన్లు అంటే సరైంది కాదని అన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలైతే బీసీ రిజర్వేషన్లు పెండింగ్లో పడిపోతుందని వివరించారు. పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు.రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.