నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 20 : ఎవరైనా సపాయి కర్మచారీలను వేధిస్తే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టర్లు వేధిస్తే వారిని బ్లాక్ లిస్టులో పెడతామని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ వైస్ చైర్పర్సన్ అంజ నాపన్వార్ హెచ్చరించారు. సఫాయి కర్మచారీలు సామాజికంగా, ఆర్థికంగా అభివద్ధి చెందేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు అధికారులు అ మలు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం నాగర్‌కర్నూల్ పట్టణంలోని తిరుమల ఫంక్షన్హాల్లో వివిధశాఖల జిల్లా అధికారులు, సఫాయి కర్మచారులు, కాం ట్రాక్టర్లు తదితరులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ముందుగా మున్సిపాలిటీ లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల స్థాయిలో పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల పురోగతిని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. సాంఘిక సంక్షేమం, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్యం, బ్యాంకింగ్, విద్య, కార్మిక, పోలీస్ శా ఖల అధికారులతో చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అసమానత లు లేకుండా సఫా యి కార్మికులు అన్ని విధాలా ఎదిగేందుకు వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగు పర్చడంతోపాటు జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. అంతకుముం దు ఆమె అంబేదర్ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో ఈడీ రామ్‌లాల్, డీఎస్పీ మోహన్‌కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీధర్‌జీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కమలాకర్‌రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ అధికారిణి రమాదేవి, లేబర్ అధికారి మహమ్మద్ షఫీ, మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్‌రావు, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సఫా యి కార్మికులు పాల్గొన్నారు.