ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దు
ప్రతి పక్షనాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, నిత్యం ప్రజాసమస్యలపై పోరాడే నా యకుడైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డికి ఓటు వేయాలని ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ శశిరేఖ అన్నారు. శనివారం మండలంలోని రాణిపేట, దోనూర్, మల్లాపూర్, కొత్తూర్, బోయిన్పల్లి, వాడ్యాల్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు.
- గ్రామాల్లో గులాబీ శ్రేణుల ప్రచారం
- అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న నాయకులు
మిడ్జిల్, నవంబర్ 18 : ప్రతి పక్షనాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, నిత్యం ప్రజాసమస్యలపై పోరాడే నా యకుడైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డికి ఓటు వేయాలని ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ శశిరేఖ అన్నారు. శనివారం మండలంలోని రాణిపేట, దోనూర్, మల్లాపూర్, కొత్తూర్, బోయిన్పల్లి, వాడ్యాల్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఉన్న పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు జంగిరెడ్డి, రైతుసమితి మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, నాయకులు సుధాబాల్రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, నారాయణరెడ్డి, జైపాల్‌రెడ్డి, బాలు, నిరంజన్, గోపాల్, భీమ్రాజు, రాజు, ఆంజనేయులు, నవీనాచారి, సురేశ్ పాల్గొన్నారు.
బాలానగర్‌లో..
బాలానగర్, నవంబర్ 18 : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గెలుపు అభివృద్ధికి మలుపు అని బీఆర్ఎస్ వర్కింగ్ మండలాధ్యక్షుడు బా లూనాయక్ అన్నారు. శనివారం మండలంలోని నామ్యతండా, పలుగుమీదిగడ్డతండా, వనమోనిగూడలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమ లు చేసిన సంక్షేమ పథకాలతోపాటు, మ్యానిఫెస్టోను ఓటర్లకు వివరించి కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు వనమోనిగూడలో కూలీ పనిచేసే వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటేయ్యాలని కోరారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు బాలయ్య, ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షుడు రమేశ్‌నాయక్, నాయకులు శ్రీనివాస్, రాజేందర్, మణి, శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్, ఫీర్యానాయక్, చంద్రకాంత్ ఉన్నారు.
గెలుపునకు ఐక్యంగా పని చేయాలి
బాలానగర్, నవంబర్ 18 : నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడే జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని మరోసారి గెలిపించాలని రైతుబంధు మండలాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని గౌతాపూర్, బోడజానంపేట, ఆప్పాజిపల్లి, పలుగుమీదితండా గ్రామ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధికి పరితపించే లక్ష్మారెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతున్నాదన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గెలుపుకోసం నాయకులు, కార్యకర్తలు కంకణబద్ధులై పని చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు బాలూనాయక్, బాలయ్య, రమేశ్‌నాయక్ పాల్గొన్నారు.
నవాబ్‌పేటలో..
నవాబ్‌పేట, నవంబర్ 18 : మండల కేంద్రంతోపాటు కూచూర్, పోమాల, చెన్నారెడ్డిపల్లి, రుద్రారం గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ లక్ష్మారెడ్డికి మద్దతుగా శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారుగుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, సర్పంచులు గోపాల్‌గౌడ్, లక్ష్మమ్మ, కృష్ణయ్య, లలితమ్మ, నాయకులు సంజీవరెడ్డి, కృష్ణగౌడ్, రవి, జైపాల్‌యాదవ్, నర్సింహులు, జగన్మోహన్గౌడ్, మల్లేశ్‌యాదవ్, నరేశ్, రవీందర్, కుమార్ పాల్గొన్నారు.
రాజాపూర్‌లో..
రాజాపూర్, నవంబర్ 18 : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కారుగుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని జెడ్పీటీసీ మోహన్‌నాయక్ అన్నారు. శనివారం సింగమగూడతండాలో ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే మండల కేంద్రంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఎంపీటీసీ అభిమన్యురెడ్డి కోర్రతండా, బదిలీతండా, రాఘవపూర్, హనుమండ్ల తండాలో ఇంటింటికీ తిరిగి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
హన్వాడలో..
హన్వాడ, నవంబర్ 18 : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అల్లుళ్లు డాక్టర్ శరత్ చంద్రగౌడ్, వంశీగౌడ్ అన్నారు. శనివారం మం డలంలోని టంకర గ్రామంలో కారు గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేపట్టారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పదేండ్లలో గ్రామంలో చేసిన అభివృద్ధిని చూసి మరోసారి కారు గుర్తును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి శివకుమార్, నాయకులు జంగీర్, శ్రీనివాసులు, వెంకటయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

