మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, అక్టోబర్ 23 : అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని ఎక్సైజ్, పర్యాటకశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని శివ సాయినగర్ కాలనీలోని ముడా కార్యాలయంలో చైర్మన్‌గా లక్ష్మణ్‌యాదవ్ ప్రమాణ స్వీకారం, పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎనుగొండలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. అనంతరం ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్ మాట్లాడుతూ.. కష్టకాలంలోనూ పార్టీకి కట్టుబడి ఉండడంతోనే ముడా చైర్మన్ పదవి తనను వరించిందన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.