నాగర్‌కర్నూల్‌టౌన్, అక్టోబర్ 20: మారుతున్న కాలానికి అనుగుణంగా కుల వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కుమ్మరుల వెన్నంటే ఉంటూ ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ యార్డులో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం పరిధిలోని కుమ్మరులు కుండల తయారీ యంత్రాల పంపిణీలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ ర హిత సమాజ నిర్మాణం కోసం కులవృత్తులు ఎంతగానో దోహద పడుతున్నాయన్నారు. కుండల తయారీకి అవసరమయ్యే యంత్రాలను రాష్ట్ర ప్రభుత్వం వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ నుంచి 80శాతం సబ్సిడీ ద్వారా అందిస్తున్నదన్నారు. మండలంలోని కుమ్మెర గ్రామంలో ఎమ్మెల్యే మర్రి కృషితో మెగా కంపెనీ వారు అన్ని రకాల మౌలిక వసతులతో జిల్లా పరిషత్ పాఠశాల నూతన భవన నిర్మాణానికి ముందుకు వచ్చారు. భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మర్రి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమాధికారి అనిల్‌ప్రకాశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, మున్సిపల్ చైర్మన్ కల్పన, ఎంపీపీ నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాములు, మార్కెట్ చైర్మన్ కుర్మయ్య,వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, కుమ్మర శాలివాహన సంఘం పాలమూరు జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న ఉన్నారు.