హన్వాడ, జూన్ 6 : మండల తాసీల్దార్ కార్యాలయంలో సర్వర్ రాకపోవడంతో భూ విక్రయ, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భూములను రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వచ్చిన రైతులు సాయంత్రం వరకు వేచి చూసినా సర్వర్ పనిచేయలేదు.
సర్వర్ వచ్చిన సమయంలో కరెంట్ కోతలు ఉండడం.. విద్యుత్ సరఫరా ఉన్న సమయంలో సర్వర్ పనిచేయకపోడంతో పలువురికి ఇబ్బందులు తప్పలేదు. వీరితో త్వరగా ప్రక్రియ చేపట్టకపోవడంతో అధికారులు కూడా తలలు పట్టుకున్నారు. అలాగే కులం, ఆదాయం సర్టిఫికెట్లకు వచ్చిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్లను సోమవారం పూర్తి చేస్తామని తాసీల్దార్ చెప్పడంతో విక్రయ, కొనుదారులు నిరాశగా వెనుతిరిగారు.