వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్‌నగర్, జూన్ 14 : సాగునీరు, రైల్వే ప్రాజెక్టుల చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, రైల్వే, కోయిల్‌సాగర్ తదితర పథకాల కింద అవార్డు స్టేజ్‌లో ఉన్న వాటిని , డీఎన్ స్టేజ్‌లో ఉన్న వాటిని వారంరోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా, పీఆర్ఎల్ఐ కింద అవార్డు ప్రక్రియను పూర్తి చేయడమే కాకుండా పేమెంట్ పెండింగ్ లేకుండా చెల్లింపులు చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు తెలియజేశారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పేరూర్ క్రాసింగ్ స్టేషన్ అవార్డును వారంలోగా పూర్తి చేసి పంపనున్నట్లు స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ పేర్కొన్నారు. అనంతరం కారుకొండ టన్నెల్, పీఆర్ఎల్ఐ, కోయిల్‌సాగర్‌తోపాటు తదితర ప్రాజెక్టులపై కలెక్టర్ సమీక్షించారు. వీసీలో అదనపు కలెక్టర్ సీతారామారావు తదితరులు ఉన్నారు.
ప్లాట్లపై సందేహం అవసరంలేదు
జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న రాజీవ్‌స్వగృహ సారికా టౌన్షిప్లో ఉన్న ప్లాట్ల కొనుగోలుపై ఎలాంటి సందేహం అవసరంలేదని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఫ్రీ బిడ్ సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడా రు. సారికా టౌన్షిప్లో ఉన్న 348 ఓపెన్ ప్లాట్స్‌కు 20నుంచి 26వ తేదీవరకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. సారికా టౌన్షిప్ భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందని, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో భూ త్పూర్ మున్సిపాలిటీ బాధ్యత ఉంటుందన్నా రు. మంచి లేఅవుట్ చిన్నచిన్న ప్లాట్లు ఉన్నాయన్నారు. వేలంలో కనీసం రూ.8వేలు దాటి వేలం పాడాల్సి ఉంటుందన్నారు. ఆసిక్తగల వారు రూ.10వేలు ముందస్తు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనాల్సి ఉంటుందని, ఉద్యోగులకు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం క ల్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్బీఐ మేనేజర్ సునీత ఉన్నారు.
ఈవీఎంల గోదాము పరిశీలన
కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎంల గోదామును కలెక్టర్ వెంకట్రావు పరిశీలించారు. ఈవీఎంల గోదాము భద్రతను పకడ్బందీగా కొనసాగించాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. అలాగే జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్‌లో చేపట్టిన పనులను కలెక్టర్ పరిశీలించారు. మినీ ట్యాంక్‌బండ్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న పనులను కమిటీ సభ్యులు పర్యవేక్షించి వేగవంతం సూచించారు. అనంతరం వాసవీ కళాశాల వద్ద చేపడుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. పట్టణప్రగతి కార్యక్రమంలో గుర్తించిన ప్రతి సమస్యనూ పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఇంజినీర్ మనోహర్, కలెక్టరేట్ ఏవో కిషన్, తాసిల్దార్ శోభ, జాఫర్ పాల్గొన్నారు.