కొల్లాపూర్ : గ్రామ పరిపాలన అధికారులు అంకితభావంతో పనిచేస్తూ రైతులకు భూ సమస్యలను ( Land Issues ) ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ (Additional Collector Amarendar ) సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తాలూకా స్థాయి గ్రామ పరిపాలన అధికారుల తో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ముఖ్యంగా గ్రామాల్లో భూ సమస్యలు ఆధికంగా ఉన్నాయని, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కరించి మేలు చేయాలని కోరారు. తెలంగాణలో భూమి విలువ పెరిగిందని దీంతో జీపీఓలకు అనేక సవాళ్లు ఎదురవుతాయని అన్నారు. గ్రామ అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, చట్టం ప్రకారం జాగ్రత్తగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో బన్సీలాల్, తహసీల్దార్ శ్రీనివాసులు, గ్రామ పరిపాలన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.