అమ్రాబాద్, మార్చి 14: పదర మండలం రాయలగండి లక్ష్మీచెన్నకేశవస్వామి ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆయన సతీమణి జెడ్పీటీసీ అనురాధ పాల్గొని స్వామి వారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య వారి చేతుల మీదుగా కల్యాణం జరిపించారు.
కల్యాణోత్సవం తిలకించేందుకు భక్తులు తరలి వచ్చారు. అనంతరం నిర్వాహకులు కోలాటం, భజన, వాలీబాల్ పోటీలు నిర్వహించి గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. రాత్రి ఆలయ ఆవరణలోసాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
అచ్చంపేట, మార్చి 14: రాయలగండి లక్ష్మీచెన్నకేశవస్వామి కల్యాణ తలంబ్రాలను గురువారం అచ్చంపేట నుంచి భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. మాలమహానాడు, మాల ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని ఆదర్శనగర్ మాలమహానాడు భవనంలో మహిళలు భక్తిశశ్రద్ధలతో తలంబ్రాల బియ్యం కలిపి మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా పదర మండలం రాలయగండి లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయానికి తీసుకెళ్లారు.
కార్యక్రమం లో మాలమహానాడు అధ్యక్షుడు బాలస్వామి, ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు అంజనేయులు, ప్రధానకార్యదర్శి రవీందర్, నిరంజన్, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, జీవన్‌కుమార్, శ్రీనివాసులు, కపిల్‌దేవ్, రవి, నారాయణ, రామస్వామి, శ్రీను, తిరుపతయ్య, శ్రీశైలం, సామవెంకటేశ్, మో హన్, జానకిరాం, రాధమ్మ, ఝాన్సీ, గోపాలమ్మ, శశికల, రత్నమాల, మాధవి, పద్మ, లక్ష్మికాంతమ్మ, విజయ, సునీత, ఇందిరమ్మ, తదితరులు పాల్గొన్నారు.