మరికల్, మే 13 : గత అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓటు వేశాను.. పార్లమెంట్ ఎన్నికల్లో నా ఓటును ఎందుకు తొలగించారంటూ రాకొండ గ్రామానికి చెందిన లక్ష్మమ్మ పోలింగ్ కేంద్రం గేటు ఎదుట నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పోలీసులతోనూ ఆమె వాగ్వాదానికి దిగింది.
మీరు మీ డ్యూటీ చేస్తున్నారు.. మరి నేను కూడా బాధ్యతగా ఓటు వేయాలి కదా..? మరి నా ఓటెందుకు తీసేశారంటూ పోలీసులు, పంచాయతీ కార్యదర్శితో వాదనకు దిగింది. గ్రామస్తులు సర్ధిచెప్పినా వినకపోవడంతో కొంత సేపు పోలింగ్‌ను నిలిపివేశారు. అనంతరం కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను వారించి ఇంటికి తీసుకెళ్లారు.