కల్వకుర్తి, ఫిబ్రవరి 16 : రైతు, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హమీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న కల్వకు ర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు మున్సిపాలిటీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రైతు నిరసన దీక్షకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆ యన కోరారు. మాజీ మంత్రి కేటీఆర్ హాజరవుతున్న ఈ కార్యక్రమ ఏర్పాట్లను లక్ష్మారెడ్డితోపాటు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ వెంకటేశ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, మాజీ జెడ్పీటీసీ దశరథ్నాయక్, స్థానిక నాయకులతో క లిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడు తూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అమలు చే యడం చేతగాక ఢిల్లీ టూర్లతో టైంపాస్ చేస్తూ తెలంగాణ ప్రజలను నిండా ముంచుతున్నారని మండిపడ్డారు. కరో నా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ కేసీఆర్ రైతుబంధు ఇ వ్వగా, రేవంత్రెడ్డి రూ.15వేలు ఇస్తానని గొప్పలు చెప్పి రెండు పంటలు ఎగ్గొట్టి రూ.12వేలు ఇస్తామని మాటమా ర్చి అవి కూడా ఇవ్వడం చేతనైతలేదన్నారు. రుణమాఫీ చేయకుండా, రైతు భరోసా ఇవ్వకుండా, చివరకు పోసిన పాలకు బిల్లులు ఇవ్వకుండా రైతులను అరిగోస పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయం చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కోవడం దుర్మార్గమన్నా రు. రైతుల పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుందని స్పష్టం చే శారు. రైతు నిరసన దీక్షకు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు త రలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్, మాజీ జెడ్పీటీసీ నర్సింహ, మాజీ ఎంపీపీ నిర్మల శ్రీశైలంగౌడ్, నాయకులు శ్రీనునాయక్, జ్యోతయ్య, శ్రీ ను, బాలస్వామి, రమేశ్, సతీశ్, సైదుల్గౌడ్, జ గన్, వెం కటేశ్, యాదయ్య, శేఖర్, దేవేందర్ పాల్గొన్నారు.