గద్వాల టౌన్, డిసెంబర్ 24 : ఆపద మొ క్కుల వాడ.. అనాథ రక్షక.. ఏడుకొండల వాడ గోవిందా గోవిందా.. అన్న నినాదాలు గద్వాల జిల్లా కేంద్రంలో మార్మోగాయి. శనివారం జి ల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్కేశవ్ ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామికి లక్షపుష్పార్చన కార్యక్ర మం వైభవంగా జరిగింది. ముందుగా ఏర్పా టు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి కొలువుదీర్చారు.
అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఉత్సవమూర్తులకు అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ రకాల పుష్పాలను అర్పిస్తూ కా ర్యక్రమం ఆధ్యంతం అట్టహాసంగా నిర్వహించారు. పుష్పాలంకరణలో వేంకటేశ్వరుడు భక్తులకు కనువిందు చేశాడు. దివ్య మనోహరుడిని దర్శించుకొని వేలాదిగా తరలివచ్చిన భక్తులు పరవశించిపోయారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ సరిత, మున్సిపల్ చై ర్మన్ కేశవ్ దంపతులు హాజరయ్యారు. స్వామి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వి విధ శాఖల అధికారులు, బీఆర్ఎస్ నాయకు లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.