ఇటిక్యాల, జనవరి 17 : పవిత్రమైన బీచుపల్లి క్షేత్రానికి పక్కనే కృష్ణానది ఉన్నది. అక్కడున్న పు ష్కరఘాట్లో పారిశుధ్యం కొరవడడంతో ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కృష్ణానదిలో అంతంతమాత్రంగా ఉన్న నీటి లభ్యతతో పిల్లకాల్వను తలపిస్తూ ప్రవహిస్తున్న నదిలో విడిచినపాత దుస్తులు, చెప్పులు, పూలదండలు, ప్లాస్టిక్ సంచులు దేవుని చిత్రపటా లు, అస్థికలు కలగలిసి మురుగు కాల్వను తలపించేలా నది పవిత్రతను పాడు చేస్తున్నాయి. ముఖ్యం గా మాలధారణ చేసిన భక్తులు మాలధారణ పూర్తి కాగానే ధారణ సమయంలో ధరించిన దుస్తులను నదిలో విడవడం, అలాగే కర్మఖాండల నిమిత్తం క్షే త్రానికి వచ్చేవారి వారి వెంట సంచులలో వివిధ ర కాల వస్తువులను తీసుకొని అస్థికలతోపాటు వదలడంతో నదిలో రోజురోజుకూ చెత్తాచెదారం నిండిపోతున్నది. వ్యర్థాలు అన్నీ నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రవాహ వేగానికి కొట్టుకుపోయేవి. ప్రస్తుతం వేసవి సమీపిస్తుండడంతో నది అంతంతమాత్రంగా ప్రవహిస్తున్నది.
దీంతో పుష్కరఘాట్ మెట్లపై నదీ రాళ్ల మధ్య వ్యర్థాలన్నీ ఇరుక్కు పోవడంతో వివిధ ప్రాంతాల నుంచి బీచుపల్లి దర్శనానికి వచ్చే భక్తులు నదీ స్నానాలు ఆచరించేందు కు, పూజలు నిర్వహించేందుకు ఇబ్బందికరంగా మారింది. నదిలో పేరుకుపోయిన చెత్తకు తోడు స మీపంలో ఉన్న ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలు ష్యం కూడా తోడవ్వడంతో నదీజలాలు మరింతగా కలుషితంగా మారాయి. దీంతో చాలామంది భక్తు లు నదిలో స్నానం చేయకుండానే వెనుదిరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే దేవస్థానం వారు నిర్వహించే పుష్కరఘాట్ పారిశుధ్య పనులను కొన్ని రోజులుగా గ్రామ పంచాయతీ వారు నిర్వహించ డం మొదలు పెట్టారు. ఇందుకు గానూ టోల్ వసూ లు టెండర్ రూ.3.71 లక్షలకు టెండర్ దక్కించుకొన్న వ్యక్తి పుష్కరఘాట్‌కు వచ్చే వాహనాలకు బస్‌కు రూ.50, కార్లకు రూ.30 చొప్పున వసూల్ చేస్తున్నాడు. దీని నుంచి ఆదాయం బాగానే వస్తు న్నా.. పుష్కరఘాట్‌లో నిత్యం చేపట్టాల్సిన పారిశు ధ్య పనులను పట్టించుకోకపోవడంతో నిత్యం వేలాదిగా వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బీచుపల్లి క్షేత్రం పవిత్రతకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్న పంచాయతీ వారినుంచి దేవాలయం వారే పుష్కరఘాట్ పారిశుధ్య పనులు చేపట్టి నది పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుకుంటున్నారు.
నాలుగైదు రోజుల నుంచి రాత్రిపూట భక్తులు వి పరీతంగా వస్తున్నారు. ముఖ్యంగా మాలధారణ చే సిన భక్తులు దుస్తులను నదీలో విడవడంతో చెత్త పేరుకుపోయిన మాట వాస్తవమే. అలాగే పండుగ ఉండడం వలన పారిశుధ్య పనులు చేసే సిబ్బంది రావడం లేదు. దీంతో నదిలో చెత్త మరింతగా పేరుకుపోయింది. వెంటనే సిబ్బందిని పురమాయించి చెత్తాచెదారం తొలగించేలా చర్యలు తీసుకుంటాం.