వనపర్తి, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన పనులకే మ ళ్లీ పూజలు నిర్వహిస్తుండడం విమర్శలకు దారి తీ స్తుంది. నూతన ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం చె ప్పుకోదగ్గ పనులు మొదలు కాలేదు. గతంలో శంకుస్థాపనలు చేసిన పనులు ప్రారంభిస్తే.. బీఆర్ఎస్కు పేరొస్తుందని, ప్రభుత్వ, ప్రైవేట్ పనులకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు. జిల్లాలోని మరికొన్ని చోట్ల టెండర్లు పూర్తి అయిన పనులను సైతం రద్దు చేయిస్తున్నారు. ఈ క్ర మంలో 14 నెలలు గడుస్తున్నా.. అభివృద్ధి జాడ లేకపోవడంతో మళ్లీ చేసిన పనులకే పూజలు చేస్తూ తా మే చేస్తున్నామన్నట్లు కనిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు గు ప్పిస్తున్నారు.
జిల్లా పరిధిలోని కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి శివారులో పామాయిల్ కంపెనీకి 20 23 సెప్టెంబర్ 28న అప్పటి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరెడ్డితో కలిసి నాటి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శం కుస్థాపన చేశారు. అప్పుడు ప్రీ యూనిక్ ఇండియా లిమిటెడ్ కంపెనీయే ఈ పనులను చేపట్టి శ్రీకారం చుట్టింది. దీని అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మా రడంతో ఈ కంపెనీ పనులకు బ్రేకులు పడ్డాయి. ఇది ప్రైవేట్ కంపెనీ, పనులు చేసేందుకు కంపెనీ ఆసక్తిగా ఉన్నప్పటికీ పలు ఆటంకాలు ఎదురు కావడంతో ముందుకు సాగనివ్వలేదన్న విమర్శలున్నాయి. ప్ర భుత్వం పామాయిల్ తోటలను పెంచటంపై ప్రత్యేక చొరవ అన్నట్లు కనిపిస్తున్నా.. ఇలా కంపెనీ పనులు మొదలు కాకుండా ఇంతకాలం నిలిపివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ జోక్యం వల్లే పనులు ముందుకు సాగలేదన్న వాదనలు వినిపించాయి. ప్రభుత్వ సహకారం అంది ఉంటే ఇప్పటి వరకే పామాయిల్ కంపెనీ ఏర్పాటై ఉండేదని రైతు లు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. మళ్లీ రాష్ట్ర వ్యవసాయశాఖ మం త్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం ఇదే పామాయిల్ కంపెనీ కోసం ప్రీ యూనిక్ ఇండియా లిమిటె డ్ ఆధ్వర్యంలోనే పనులకు మళ్లీ పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. దాదాపు రూ.200 కోట్లతో ఈ కంపెనీ ఏర్పాటుకు గతంలోనే కార్యాచరణ జరిగింది.