మహబూబ్‌గర్, జూన్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టుడు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హైదరాబాద్‌లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఆదివారం ఉమ్మడి జిల్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో పాటు పార్టీ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, రానున్న వచ్చే ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించడం ఖాయమన్నా రు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్‌రెడ్డిని ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రజలు జిల్లా నుంచి తరిమికొడతారని ఆరోజు దగ్గరలోనే ఉందన్నారు. 90శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి, కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం లక్షల ఎకరాలకు సాగునీరందకుండా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నా రు. మహబూబ్‌నగర్ బిడ్డను అని పదేపదే చెప్పుకుంటూ జిల్లా ప్రజలను మోసం చేస్తూ అన్ని రంగా ల్లో జిల్లా అభివృద్ధికి ఆటంక పడుతున్న రేవంత్‌రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
సీఎం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి తీవ్రమైన ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో మాదిరి మరోసారి కొడంగల్ నియోజకవర్గంలోనూ రేవంత్ రెడ్డికి ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. కేవలం మాటలు చెప్పి.. ప్రకటనలకు పరిమితమైతే జిల్లా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని ఇప్పటికే అందరికీ తెలిసిపోయిందన్నారు. జిల్లా ప్రజలకు చేయాల్సిన అభివృద్ధిని.. పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను పక్కనపెట్టి కేవలం రాజకీయాలు చేస్తున్న రేవంత్‌రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు
ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణ ఏర్పాటుకు ముందు వలసల జిల్లాగా, కరువు జిల్లాగా ఉండేదని, అలాంటి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి కరువును, వలసలను తరిమికొట్టిన ఘనత ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ గుర్తు చేశారు. ఇంత గొప్పగా జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో గత ఎన్నికల్లో పార్టీ విఫలమైందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత ప్రజలకు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఒకవైపు ప్రజల్లోకి తీసుకెళ్తూనే, గత ప్రభు త్వ హయాంలో మనం చేసిన అభివృద్ధిని మ రోసారి ప్రజలకు గుర్తుచేయాలని కేటీఆర్ సూచించా రు. ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సాగునీటి ప్రా జెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపాలన్నారు. 60ఏండ్ల పాటు కాంగ్రె స్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగునీరు అందకుండా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమాలు అందకుం డా వెనుకబాటు జిల్లాగా చేసిన ద్రోహం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నదన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని క్షేత్రస్థాయి పరిస్థితులపై కేటీఆర్ నాయకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ ప్రస్తుతం కొనసాగిస్తున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాల తీరును ఆయన సమీక్షించారు. త్వరలో ప్రా రంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నియోజకవర్గాల వారీగా చర్చించారు.
రానున్న ఎన్నికలకు సంబంధించి, పార్టీ బలోపేతానికి సంబంధించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలోని బూత్‌ల వారీగా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఈ దిశగా కలిసికట్టుగా పక్కా ప్రణాళికాబద్ధం గా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను, ప్రజల అభిప్రాయాలను, ఫీడ్ బ్యాక్‌ని కేటీఆర్‌కి అందించారు. క్షేత్ర స్థాయిలో పార్టీకి ప్రజల్లో భారీగా ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రతి ఒక్కరూ గుర్తించారని, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు చేస్తున్న మోసంపై ఆగ్రహంతో ఉన్నారని వివరించారు.
రానున్న ఎన్నికల్లో జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టాలని నేతలను ఆదేశించారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం పైన నియోజకవర్గాల వారీగా చర్చించారు.
కేటీఆర్ పార్టీ నేతలకు రానున్న ఎన్నికలకు సం బంధించి, పార్టీ బలోపేతానికి సంబంధించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
ప్రతి గ్రామంలోని బూత్ వారీగా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఈ దిశగా కలిసికట్టుగా పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆ యన సూచించారు. సమావేశంలో మాజీ మం త్రులు డా.సి.లక్ష్మా రెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్, సీ. నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామ్రెడ్డి , నవీన్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి , రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి , మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్య యాద వ్, జైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..