తిమ్మాజిపేట, డిసెంబర్ 24 : తండ్రిని కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిని పలువురు పరామర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్‌అలీతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు కలిసి ధైర్యం చెప్పారు. తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లిలోని ఆయన స్వగృహానికి కారు నడుపుకొంటూ కేటీఆర్ రాక పక్కన హరీశ్‌రావు చేరుకొని మాజీ ఎమ్మెల్యే మర్రిని ఆలింగనం చేసుకొని ఓదార్చారు.
అనంతరం జంగిరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మర్రి తండ్రి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తల్లి అమృతమ్మను వారు పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. దాదాపు గంటపాటు అక్కడే ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, కోటిరెడ్డితోపాటు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్కసుమన్, గ్యాదరి కిషోర్, గండ్ర వెంకట రమణారెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, నా యకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, రవీంద్రకుమార్, ప్రభాకర్‌రెడ్డి, భిక్షమయ్యగౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మల్లికార్జున్‌రెడ్డి, నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజిని, బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.