కొల్లాపూర్, సెప్టెంబర్ 2 : నల్లమలలోని కృష్ణానది పొంగిపారుతుండడంతో అక్కడి జాలర్లు, చెంచులు భ యాందోళన చెందుతున్నారు. అమరగిరికి సమీపంలో నది మధ్యలో ఉన్న చీమలతిప్పపై ఆంధ్రాలోని వైజాక్కు చెందిన 45 జాలర్ల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నది ప్రవాహం రోజురోజుకూ పెరగడంతో ద్వీపంలాంటి గుట్టపై ఉన్న జాలర్లు ప్రమాదపుటంచున క్షణక్షణం.. భయం నీడలో బతుకుజీవుడా అన్నట్లు మిగిలారు. కొండ పైభాగానికి చేరుకొని తలదాచుకున్నారు.
అలాగే చేపల వేటకు వెళ్లి కనటాగువా గు, గుండ్లపెంట వద్ద స్థావరాలను ఏర్పాటు చేసుకున్న చెంచులు సైతం నదీ ప్రవాహంలో చిక్కుకున్నారు. చేపలవేటకు వెళ్లిన చెంచులు భయబ్రాంతులకు గురయ్యా రు. అయితే సోమవారం వరద కొంచెం తగ్గుముఖం పట్టడంతో ఊపిరిపీల్చుకున్నారు. 2009 ఏడాదిలో వ చ్చిన వరదలు మళ్లీ పునరావృతం అవుతాయా..? అని ఆందోళన చెందారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో జాలర్లను హెచ్చరించడంతోపాటు నదిలో ప్రమాదంలో ఉన్న జాలర్లను ఒడ్డుకు రప్పించడంలో ప్రభుత్వం విఫ లమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చేపల వేట జీవనాధారంగా బతికే చెంచులు కృష్ణానదిలోకి వెళ్లి వరదలో చిక్కుకుపోయారు. శుక్రవారం నుంచి సోమవారం వరకు వాళ్లు ఎలా ఉన్నారో తెలియలేదు. ఆదివారం సంతకు వచ్చే వారు రాకపోవడంతో భయపడ్డాం.. వరద ఉధృతి తగ్గడంతో ప్రమా దమేమీలేదు. వరదలు వచ్చిన ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
– మల్లేశ్, చెంచు సంఘం నాయకుడు, అమరగిరి