మక్తల్, అక్టోబర్ 22 : గతంలో ఎన్నడూ లేనిది లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.కోట్లలో కరెంట్ బిల్లు కట్టాలని నోటీసులు పంపించడం ఎంతవరకు సమంజసమని, రైతులపై కాంగ్రెస్‌కు ఎందుకింత కక్ష సాధింపు అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. కృష్ణ మండలం పుంజనూర్ ఎత్తిపోతల పథకానికి కరెంట్ బిల్లు చెల్లించాలంటూ ట్రాన్స్‌కో అధికారులు పంపిన నోటీసులు పంపడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం లిఫ్ట్ ఇరిగేషన్ సొసైటీ అధ్యక్షులతో కలిసి తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలంలో బీడు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లకు 1986 నుంచి రైతులకు కరెంట్ బిల్లు భారం మోపరాదనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభు త్వం వరకు కూడా ఇరిగేషన్ శాఖ అనుసంధానంతో చెల్లించుకుంటూ రావడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత లిఫ్టులకు సంబంధించిన కరెంట్ బిల్లు కట్టాలని కృష్ణ మండలం ముడుమాల్ ఎత్తిపోతల పథకం పుం జనూర్ లిఫ్ట్టు శ్రీ రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ సొసైటీ సభ్యులకు ట్రాన్స్‌కో అధికారులు 1 జూలై 2024న రూ. 2కోట్ల 64లక్షల 3,338 చెల్లించాలని నోటీసు పంపించారన్నారు. మరో రెండు నెలల తర్వాత 1 అక్టోబర్ 2024న రూ.2,63,17,512 బిల్లు చెల్లించకపోతే అక్టోబర్ 30న విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని నోటీసులో పేర్కొనడం ఎంతవరకు సమంజసమన్నారు. సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా గత ప్రభుత్వాలు రైతులకు అండగా నిలువగా, కాం గ్రెస్ సర్కారు మాత్రం గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతుల పై భారాన్ని మోపేలా చర్యలు చేపట్టడం సరికాదన్నారు. ని యోజకవర్గంలోని పుంజనూర్తోపాటు ఇతర లిఫ్టులకు రూ.9 కోట్లతో కేసీఆర్ సర్కారులో మరమ్మతులు చేయించామన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పం దించి కరెంటు బిల్లుల నోటీసుపై స్పందించి తగిన చర్య లు తీసుకోవాలన్నారు. సమావేశంలో లిఫ్ట్ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసులు, స్వామిగౌడ్, మక్తల్ పట్టణ అధ్యక్షుడు చిన్న హన్మం తు, నాయకులు గాల్‌రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.